రౌద్రం రణం రుధిరంలో కొత్త పాత్ర ఎవరో తెలుసా!
రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న `ఆర్.ఆర్.ఆర్. సినిమా కొత్త షెడ్యూల్ జరగబోతోంది. ఇందుకు సంబంధించిన వివరాలు రోజుకు రోజుకూ కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఎన్.టి.ఆర్. నటిస్తున్న పాత్ర కొమరం భీమ్. రామ్ చరణ్ చేస్తున్న పాత్ర అల్లూరి సీతారామరాజు. ఈ సినిమాకు రౌద్రం రణం రుధిరం అని తెలిసిందే. లాక్‌డౌన్ తర్వాత ఇటీవలే హైదరాబాద్ శివార్లో షూట్ మొదలైంది.
ఇందులో అలియా భట్ సీతగా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ నటులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. వారిలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కూడా ఒకరు. మరి అజయ్ ఈ చిత్రంలో ఎలాంటి పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నారో కూడా ప్రెజెంట్ చేశారు. ఈ సినిమాలో అజయ్ దేవ్‌గన్ పాత్ర ఎన్టీఆర్ చేస్తున్న కొమరం భీం కు తండ్రిగా కనిపించనున్నాడట.ఈ విషయం అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.