గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 జనవరి 2024 (19:19 IST)

స్పెషల్ సాంగ్ ఆకలి తీర్చే పాట... రంగంలోకి ఈషా రెబ్బా

Eesha (Photo : Instagram)
సంక్రాంతికి ఐటెం సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. మహేష్ బాబు గుంటూరు కారంలోని కుర్చీ మడతపెట్టి పాట తప్ప, మరే ఇతర చిత్రంలోని పాట ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అందుకేనేమో ఇక స్పెషల్ సాంగ్స్‌ని ఇష్టపడే సినీ ప్రియుల ఆకలిని తీర్చే సినిమా రాబోతోంది.
 
సెన్సేషనల్ స్టార్ విశ్వక్సేన్ రాబోయే చిత్రం "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి"లో మాస్ బీట్ సాంగ్ రాబోతోంది. ఈ పాట కోసం నోరా ఫతేహి, కాజల్ అగర్వాల్ వంటి తారల పేర్లను మేకర్స్ పరిశీలించారు. 
 
కానీ దర్శకుడు కృష్ణ చైతన్య ఈ పాటకు తెలుగు బ్యూటీని రంగంలోకి దించాలని భావిస్తున్నారట. దీంతో ఈషా రెబ్బా పేరు తెరపైకి వచ్చింది. మరో రెండు రోజుల్లో పాట చిత్రీకరణ జరగనుంది. ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి షూటింగ్ మార్చి 8న విడుదల చేయాలని యూనిట్ భావిస్తోంది.