న్యాయం జరగకపోతే ఆత్మహత్మ చేసుకుంటానంటున్న బాలీవుడ్ హీరోయిన్!
బాలీవుడ్ నటి అలీసా ఖాన్.. తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్మ చేసుకుంటానని సంచలన వాఖ్యలు చేసింది. ఆ వివరాలను పరిశీలిస్తే... అలీసా హరిద్వార్‌కి చెందిన మోడల్, నటుడు లవ్ కపూర్‌ను తొలి చూపులోనే ప్రేమించి పె
బాలీవుడ్ నటి అలీసా ఖాన్.. తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్మ చేసుకుంటానని సంచలన వాఖ్యలు చేసింది. ఆ వివరాలను పరిశీలిస్తే... అలీసా హరిద్వార్‌కి చెందిన మోడల్, నటుడు లవ్ కపూర్‌ను తొలి చూపులోనే ప్రేమించి పెళ్లి చేసుకుంది. సజావుగా సాగుతున్న వీరి కాపురంలో కలతలు చోటుచేసుకోవడంతో కొద్దిరోజుల క్రితం అతను తనని నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడని అలీసా హరిద్వార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
అత్తింటివారు కూడా తనపట్ల కనికరం చూపడం లేదని ఫిర్యాదులో పేర్కొంది. అసలు విషయం ఏంటంటే... అలీసా తన బాయ్ ప్రెండ్‌తో ఉన్న వీడియోను ఎవరో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో ఆ వీడియో చూసిన పుట్టింటివారు, అత్తింటివారు ఆమెపై నిప్పులు చెరిగారట. మా కుటుంబం పరువు తీస్తున్నావంటూ భర్త ఇంటి నుంటి వెళ్లగొట్టారట. దీంతో ఏం చేయాలో అర్థం కానీ ఈ అమ్మడు ఢిల్లీలోని ఈ కైలైష్ ప్రాంతంలోని ఓ దేవాలయంలో ఆశ్రయం కోసం తలదాచుకుంటోంది.
'మా ఫ్యామిలీ నన్ను ఇంట్లో నుండి గెంటివేయడంతో రోడ్డునపడ్డాను. నాకు వేరే దారి లేదు. దాంతో మీడియాను నేను సహాయం కోరుతున్నాను. నేను పోరాటం చేయాలనుకుంటున్నాను'' అంటూ అలీసా ఖాన్ తెలిపారు. అంతేకాదు పోలీసులు కూడా తనకు సహాయం చేయడం లేదని, తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆమె మీడియాతో వెల్లడించింది. కాగా ఈ విషయమై హరిద్వార్ ఎస్‌ఎస్పీ రాజీవ్ స్వరూప్ కేసుపై దర్యాప్తుచేయాలని పోలీసులను ఆదేశించారు. ప్రస్తుతం అలీసా... బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మికి జంటగా ఓ సినిమాలో నటిస్తోంది. అలీసా ఇదివరకు హిందీ, తమిళ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.