శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Modified: శనివారం, 13 ఫిబ్రవరి 2021 (13:27 IST)

కియార‌కు ఫ్రీడం వ‌చ్చింది!

kiara adwani
న‌టీమ‌ణుల‌కు ఏ సినిమాలో అవ‌కాశం వ‌చ్చినా వెంట‌నే చేసేయాలి. లేదంటే వెన‌క‌బ‌డిపోతుంటారు. మొద‌ట్లో అంద‌రి హీరోయిన్ల ప‌రిస్థితి ఇంతే. అందుకే `ఏ పాత్ర వచ్చినా చేయాలని అనుకునేదాన్ని` అంటూ బాలీవుడ్ న‌టి కియార అద్వ‌నీ పేర్కొంది. తెలుగులో మ‌హేష్‌బాబుతో `భ‌ర‌త్ అనే నేను` సినిమాలో న‌టించింది. అది ఊహించినంత విజ‌యాన్ని చేరుకోలేదు. కానీ బాలీవుడ్‌లో ఆమె న‌టించిన `క‌బీర్ సింగ్‌`కు అనూహ్య స్పంద‌న ల‌భించింది. దాంతో ఆమె ఫేటే మారిపోయింది. క‌బీర్ సింగ్ అనేది తెలుగులో అర్జున్ రెడ్డి రీమేక్‌. ఇందులో హారోయిన్‌కు అధిక ప్రాధాన్య‌త వుంది. నేను చేసిన న‌ట‌న‌కు మంచి మార్కులు వ‌చ్చాయి. సినిమా విజ‌య‌వంతం అయింది.  
 
ఈ విష‌య‌మై ఆమె ఇలా స్పందించింది. ‘బాలీవుడ్ నన్ను అంగీకరించేందుకు చాలా సమయం పట్టింది. మొదట్లో నేను ఇక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఏ పాత్ర వచ్చినా చేయాలని అనుకునేదాన్ని. ఇప్పుడు పాత్రల ఎంపికలో నాకు స్వేచ్ఛ దొరికింది. పరిశ్రమ నుంచి ప్రోత్సాహం దొరికింది. ప్రతిభ ఉంటే ఇక్కడ ఎవరైనా రాణించవచ్చు. కాకపోతే కాస్త సహనం కావాలి. ప్రేక్షకులు మనల్ని అంగీకరిస్తే అవకాశాలు వాటంతట అవే వస్తాయి` అని కియార వెల్ల‌డించింది. త్వ‌ర‌లో తెలుగులో కూడా మ‌రో సినిమాలో న‌టించ‌డానికి అంగీకారం తెలిపిన‌ట్లు తెలుస్తోంది.