మంగళవారం, 28 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 ఫిబ్రవరి 2021 (19:27 IST)

అనిరుధ్ ప్రేమలో మహానటి..? త్వరలో డుం డుం డుం! (video)

Keerthy Suresh And Anirudh
''మహానటి'' కీర్తిసురేష్ ప్రేమలో పడినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతున్నాయి. కీర్తి సురేష్ ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ ప్రేమలో ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్ వస్తోంది. అంతేకాదు ఈ జంట త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు ఓ వార్త హల్ చల్ చేస్తోంది. 
 
సోషల్ మీడియాను కుదిపేస్తున్న ఈ వార్త త్వరలో నిజమయ్యే అవకాశం వున్నట్లు సినీ పండితులు జోస్యం చెప్తున్నారు. కానీ ఈ వార్తలకు సంబంధించి ఎటువంటి అధికారిక ధృవీకరణ లేనప్పటికీ, ఈ ఇద్దరు తమ పెళ్లి తేదీని అతి త్వరలోనే అభిమానులకు, శ్రేయోభిలాషులకు వెల్లడిస్తారని టాక్ వస్తోంది. 
 
ఇకపోతే.. కీర్తి సురేష్ 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. తెలుగులో కీర్తి ప్రస్తుతం నితిన్‌కు జోడిగా 'రంగ్‌దే'లో నటిస్తోంది. 
 
ఈ సినిమాతో పాటు నగేష్ కుకునూర్ దర్శకత్వంలో వస్తోన్న గుడ్ లక్ సఖిలో కూడా నటిస్తోంది. వీటితో కీర్తి సురేష్ తెలుగులో మరో ప్రతిష్టాత్మక చిత్రంలో సర్కారు వారి పాటలో కూడా నటిస్తోంది.
 
ఇక అనిరుధ్ విషయానికి వస్తే.. ఆయన తెలుగులో నితిన్ అఆతో పాటు పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసికి సంగీతం అందించాడు. వీటితో పాటు విక్రమ్ కుమార్ నాని కాంబినేషన్‌లో వచ్చిన గ్యాంగ్ లీడర్‌కు కూడా మంచి మ్యూజిగ్ ఇచ్చి ఇక్కడ కూడా పాపులర్ అయ్యాడు. ఇక ఆయన లేటెస్ట్‌గా విజయ్ మాస్టర్‌కు సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా ఇటు తెలుగుతో పాటు తమిళ్‌లో కూడా మంచి విజయాన్ని అందుకుంది.