గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 22 సెప్టెంబరు 2017 (17:55 IST)

ప్రభాస్‌కు శ్రద్ధాకపూర్ కొత్త బిరుదు.. యంగ్ రెబల్ స్టార్ కాదు.. ద న్యూ బ్లాక్‌ బస్టర్‌ కింగ్!?

బాహుబలి సినిమాకు తర్వాత ప్రభాస్ సాహోలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రద్ధాకపూర్ ద్విపాత్రాభినయం పోషిస్తోంది. ఈ సందర్భంగా హిందీ భాషను ప్రభాస్‌కు ఆమె నేర్పిస్తోందని, తెలుగు భాషను ప్రభాస్ ఆమెక

బాహుబలి సినిమాకు తర్వాత ప్రభాస్ సాహోలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రద్ధాకపూర్ ద్విపాత్రాభినయం పోషిస్తోంది. ఈ సందర్భంగా హిందీ భాషను ప్రభాస్‌కు ఆమె నేర్పిస్తోందని, తెలుగు భాషను ప్రభాస్ ఆమెకు నేర్పిస్తున్నాడని టాక్.

ఈ సినిమా షూటింగ్‌లో వీరిద్దరూ బిజీగా ఉన్న వేళ.. ప్రభాస్‌ అంటేనే శ్రద్ధాకపూర్ పడిచస్తోంది. షూటింగ్ సందర్భంగా యూనిట్‌తో మాట్లాడుతూ.. ఇప్పటివరకు ప్రభాస్ నటించిన సినిమాలన్నీ చూసేశానని చెప్పుకొచ్చింది. ప్రభాస్‌ను అంతా యంగ్ రెబల్ స్టార్ అంటారు. అయితే ప్రభాస్‌ను అలా కాకుండా ''ద న్యూ బ్లాక్‌ బస్టర్‌ కింగ్'' అంటూ కొత్త బిరుదు ఇచ్చేసింది. 
 
కాగా రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా టాలీవుడ్‌లో ప్రవేశించిన ప్రభాస్ ఇప్పటిదాకా 16 సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలన్నింటినీ శ్రద్ధా కపూర్ చూసేసిందట. సాహో తొలిరోజు షూటింగ్‌లో శ్రద్ధా కపూర్‌కు ప్రభాస్ అండ్ టీమ్ అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చిందట. ప్రభాస్ ఆతిథ్యం, ఆయన సహచర నటులతో కలివిడిగా వుండే తీరును శ్రద్ధాకపూర్ షూటింగ్ స్పాట్‌లో ప్రశంసిస్తూ గడుపుతుందట. 
 
ఇకపోతే.. యాక్షన్ థ్రిల్లర్ అయిన సాహో చిత్రాన్ని సుజీత్ రెడ్డి డైరక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం శ్రద్ధా కపూర్ రూ.5 కోట్లు పారితోషికం తీసుకునేందుకు ఒప్పుకోగా, ప్రభాస్ రూ.35కోట్ల వరకు పారితోషికాన్ని డిమాండ్ చేసినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది.