శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: సోమవారం, 13 మార్చి 2017 (17:15 IST)

ఆ ముగ్గురు ఖాన్‌ల కోసం అప్పుడు అల్లాడేదాన్ని... పిలిస్తే ఆలోచిస్తా... కంగనా రనౌత్

బాలీవుడ్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే హీరోయిన్ కంగనా రనౌత్. ఆమె ఎప్పుడు ఎవరితో మాట్లాడినా ఏదో ఒక బాంబు లాంటి మాట అనేస్తుంది. ఇక దానిపై చర్చ జరుగుతూ వుంటుంది. తాజాగా ఆమె చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారి

బాలీవుడ్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే హీరోయిన్ కంగనా రనౌత్. ఆమె ఎప్పుడు ఎవరితో మాట్లాడినా ఏదో ఒక బాంబు లాంటి మాట అనేస్తుంది. ఇక దానిపై చర్చ జరుగుతూ వుంటుంది. తాజాగా ఆమె చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. కెరీర్ బిగినింగులో తను అమీర్ ఖాన్, షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ ముగ్గురితో కలిసి నటించాలని తెగ ఆరాటపడేదాన్నననీ, ఐతే ఇప్పుడలా లేదని తేల్చి చెప్పింది.
 
ఐతే క్వీన్ అనే సినిమా చేసిన తర్వాత తనకు హీరోతో సమానంగా ఇమేజ్ వచ్చేసిందనీ, ఇప్పుడు తను కూడా ఖాన్‌ల మాదిరిగా వారితో సమానమే అని వాదిస్తోంది. అంతేకాదు... ఇప్పుడు తనకు ఓ సూపర్ హీరోకున్న ఇమేజ్ వచ్చేసిందనీ, అలాంటప్పుడు ఖాన్‌లతో ఇంకా తను నటించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తోంది. ఐతే కెరీర్ బిగినింగ్‌లో వారితో నటించాలని అల్లాడేదాన్ననని గుర్తు చేసుకుంది. కానీ ఇప్పుడు వారితో నటిస్తే తన పాత్రకు అంత ప్రాధాన్యతన వుండదనీ, అదే తన పాత్రకు ప్రాధాన్యత వుంటే మంచి పేరు వస్తుందంటూ చెప్పుకొచ్చింది కంగనా రనౌత్.