1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 జులై 2020 (16:50 IST)

పవన్ కళ్యాణ్ డేటింగ్‌కు రమ్మని పిలిస్తే అస్సలు ఆలోచించను : స్వీటీ

కరోనా లాక్డౌన్ పుణ్యమాని వెలుగులోకి వచ్చిన హీరోయి శ్రీ రాపాక అలియాస్ స్వీటీ. నగ్నం ఫేం‌గా టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రంలో బోల్డ్‌గా నటించడమే కాకుండా ప్రతి ఒక్కరి గురించి బోల్డ్‌గా మాట్లాడుతూ ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇదే అదునుగాభావించి స్వీటీ యూట్యూబ్ ఛానెళ్లకు వరుసబెట్టి ఇంటర్వ్యూలు ఇస్తూ, సంచలన కామెంట్స్ చేస్తోంది. పైగా, తనకు నచ్చిన హీరోలతో డేటింగ్‌కు సిద్ధమని ప్రకటించింది. అయితే, ఇందుకు ఆ హీరోలు కూడా సమ్మతించాలని కోరుతోంది. 
 
ఇటీవలే హీరో బాలకృష్ణ గురించి సంచలన విషయాలు బయటపెట్టిన శ్రీ రాపాక... తాజాగా ఆమె పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసింది. టార్గెట్ అనగానే ఆయనని తిట్టేసిందని మాత్రం అనుకోకండి. పవన్ కల్యాణ్ అంటే క్రష్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు ఆయనతో డేటింగ్‌కి కూడా రెడీ అంటుంది. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, "నాకు తెలుగు సినిమా హీరోల్లో పవన్ కల్యాణ్ అంటే క్రష్. అప్పట్లో ఆయనను కలవాలని రెండు మూడు సార్లు ట్రై చేశాను కూడా. కానీ కుదరలేదు. ఇక ప్రయత్నం చేయలేదు. ఆయనని కలవడం కోసం ఎవ్వరినీ అడగడం నాకు ఇష్టం లేదు. అందుకే ఎవరినీ అడగలేదు. 
 
మనసులో ఒక్కటే అనుకున్నా. ఆయనని కలవాలని ఉంటే ఖచ్చితంగా ఎప్పటికైనా కలుస్తాను అని. ఆయనంటే ఎంత ఇష్టం అంటే.. ఆయనతో డేటింగ్‌కు వెళ్లడానికి కూడా రెడీ. ఆయన పిలిస్తే అస్సలు ఆలోచించను. ఆయనతో కలిసి ఒక్క సినిమాలోనైనా నటించాలని ఉంది" అని శ్రీరాపాక (స్వీటీ) తెలిపింది. మరి నిజంగా పవన్ అంటే ఇష్టమో.. లేదంటే ఇది కూడా వర్మ స్కెచ్చో ఆ పైవాడికే తెలియాలి.