ఇంకేముంది..? బ్రేకప్.. బక్కపలచగా మారిన ఇలియానా

Last Updated: శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (16:38 IST)
చిట్టి నడుము సుందరి ఇలియానా ప్రస్తుతం చిక్కిపోయింది. ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో ప్రేమను బ్రేకప్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాగా సన్నబడింది. ఆండ్రూను గాఢంగా ప్రేమించిన ఇలియానా.. కొన్ని కారణాల వల్ల అతనికి దూరమైంది. వీరికి బ్రేకప్ కూడా అయిపోయింది. ఈ విషయాన్ని ఇల్లీ పబ్లిక్‌గా చెప్పేసింది.

కానీ ఇలియానా ఫిట్ కోల్పోయిందని.. ఫిజిక్ దెబ్బతిందని.. ఇక సినిమాలను పక్కనబెట్టేసిందని అందరూ అనుకున్నారు. అయితే ఉన్నట్టుండి ఇలియానా బక్కపలచగా తయారైంది. బ్రేకప్‌ తర్వాత చీకుచింతా లేకుండా ఉండి, ఫిజిక్‌పై దృష్టి పెట్టినట్టుంది.

మళ్లీ చిట్టి నడుము సుందరిగా మారిపోయింది. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఇల్లీ సన్నగా, ముద్దుగా కనిపించింది. దీంతో ఇల్లీ బేబీ ఇక సినిమాల్లో నటించి.. దున్నేస్తుందని ఖుషీ ఖుషీగా వున్నారు. ప్రస్తుతం హిందీలో ఇలియానా రెండు సినిమాలను చేస్తోంది.దీనిపై మరింత చదవండి :