శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : గురువారం, 21 సెప్టెంబరు 2017 (14:42 IST)

జూ.ఎన్టీఆర్‌కు ఏమైంది.. యూరప్‌లో చికిత్స?

జూనియర్ ఎన్టీఆర్ "జై లవ కుశ" పేరుతో ముందుకు వచ్చారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రాన్ని ఆయన అన్న, హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించారు.

జూనియర్ ఎన్టీఆర్ "జై లవ కుశ" పేరుతో ముందుకు వచ్చారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రాన్ని ఆయన అన్న, హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించారు. ఈ చిత్రం హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే, హీరో జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే విదేశాలకు వెళ్లి శరీరానికి చికిత్స చేయించుకోనున్నారు. దీనికి కారణం లేకపోలేదు. 
 
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. ఇందులో చాలా స్లిమ్‌గా హీరో కనిపించనున్నారు. ఇందుకోసం శరీరానికి 'డీ టాక్సినేషన్ థెరపీ' చేయించుకుంటాడట. ఇందుకోసం ఆయన యూరప్ వెళ్లాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ థెరపీ ముఖ్య ఉద్దేశం శరీరంలో పేరుకుపోయిన మలినాలను తొలగించడం. ఈ చికిత్స పూర్తయిన తర్వాత అక్కడి నుంచి మలేసియా వెళ్లి మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంటాడని అంటున్నారు. 
 
ప్రస్తుతం డైట్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, నిపుణుల పర్యవేక్షణలో జిమ్‌లోనే ఎక్కువ సమయాన్ని ఎన్టీఆర్ గడుపుతున్నాడట. థాయ్‌ల్యాండ్.. ఇండోనేషియా స్టైల్ మార్షల్ ఆర్ట్స్‌ను తెరపై చూపించాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. ప్రస్తుతం పవన్ సినిమాతో బిజీగా ఉన్న త్రివిక్రమ్... ఈ మూవీ పూర్తైన వెంటనే ఎన్టీఆర్ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లే పనిలో ఉన్నారు. ఈ చిత్రంలో కూడా అనూ ఇమ్మాన్యుయేల్‌ పేరును దర్శకుడు పరిశీలిస్తున్నట్టు సమాచారం.