శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 14 అక్టోబరు 2022 (22:25 IST)

చంద్రముఖి 2లో నేనా? అస్సలొద్దు.. ఒప్పుకోని చందమామ? (Video)

Kajal Aggarwal
'చంద్రముఖి' సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. జ్యోతిక ప్రధాన పాత్రలో రజనీకాంత్, ప్రభు, నయనతార కీలకమైన పాత్రలను పోషించిన ఆ సినిమాను ప్రేక్షకులు ఇంకా మరిచిపోలేదు. ఆ సినిమాకి సీక్వెల్ చేయాలని దర్శకుడు పి. వాసు ప్రయత్నించినప్పటికీ, అందుకు రజనీకాంత్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. 
 
దాంతో ఆ సినిమా సీక్వెల్ ను లారెన్స్ తో చేయడానికి వాసు రంగంలోకి దిగాడు. ఇటీవలే 'చంద్రముఖి 2' టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేసి షూటింగును మొదలుపెట్టారు. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు ఉంటారని చెబుతూ, వారిలో 'చంద్రముఖి' ఎవరనే ఆసక్తిని రేకెత్తించారు. టైటిల్ రోల్ కోసం కాజల్ ను సంప్రదించినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. 
 
ఈ సినిమా చేయడానికి కాజల్ అంగీకరించిందనేది తాజా సమాచారం. కీరవాణి ఈసినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.