శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : శనివారం, 8 అక్టోబరు 2016 (12:13 IST)

నా గుట్టును బయటపెట్టిన నా కారు డ్రైవర్ : కత్రినా కైఫ్

సెలబ్రిటీల జీవితం గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు ఆశపడుతుంటారు. అయితే వాళ్ల రహస్యాలు ఎంత దాయాలని ట్రై చేసినా ఎలాగోలా బయటికొచ్చేస్తాయ్. డ్రైవరో, మేకప్‌మేనో, మేనేజరో, పర్సనల్ అసిస్టెంట్స్, ఇలా ఎవరో ఒ

సెలబ్రిటీల జీవితం గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు ఆశపడుతుంటారు. అయితే వాళ్ల రహస్యాలు ఎంత దాయాలని ట్రై చేసినా ఎలాగోలా బయటికొచ్చేస్తాయ్. డ్రైవరో, మేకప్‌మేనో, మేనేజరో, పర్సనల్ అసిస్టెంట్స్, ఇలా ఎవరో ఒకరు వాళ్ల గుట్టును రట్టుచేస్తారు. అయితే ఈ మధ్య కత్రినా కైఫ్ గురించి బయటికొచ్చిన రహస్యాలన్నీ మాత్రం ఆమె డ్రైవర్ నుంచే వచ్చాయట. 
 
రణబీర్ కపూర్‌తో ప్రేమాయణం, గొడవ, అదేవిధంగా... ఆదిత్యారాయ్ కపూర్‌తో స్నేహంగా ఉన్నా.. ఇలా ఏ విషయం అయినా దాగకుండా బయటకు రావడంతో కత్రీనాకు అనుమానం కలిగిందట. ఎవరో కావాలనే విషయాలను బయటపెడుతున్నారని గ్రహించిన కత్రినా ముందుగా తన డ్రైవర్‌ని అనుమానించారట. 
 
మీడియాకి రహస్యాలు చేరవేసి, అతగాడు డబ్బులు తీసుకుంటున్నాడని తెలిసి, కత్రినా ఖంగుతిందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆ డ్రైవర్‌ను చెడామడా తిట్టిన కత్రినా ''ఇంకోసారి ఇలా చేస్తే ఉద్యోగం నుంచి తీసేస్తా'' అని హెచ్చరించిందట. డ్రైవర్ మీద మాత్రమే కాదు.. తన దగ్గర పని చేసేవాళ్లందరి మీదా కత్రినా ఓ కన్నేసిందట. మొత్తానికి ఈ భామకి ఎంత కష్టం వచ్చింది కదా.