శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 మే 2020 (17:25 IST)

బాలీవుడ్ వైపు చూస్తున్న మహానటి?

తెలుగులో అతి తక్కువ చిత్రాలు చేసినప్పటికీ.. మహానటిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన కార్తి సురేష్. అలనాటి నటి సావిత్రి బయోపిక్ చిత్రంలో ఈమె నటన అద్భుతం. ఫలితంగానే ఈమెకు మహానటి అని పేరువచ్చింది. పైగా, దేశ వ్యాప్తంగా సినీ అభిమానులను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ నటనకుగాను ఆమెకు జాతీయ అవార్డు సైతం వచ్చింది.
 
ఈ క్రమంలో కీర్తి సురేష్ బాలీవుడ్ నుంచి కూడా ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. తొలి సినిమాలోనే అజయ్ దేవగణ్ సరసన 'మైదాన్'లో నటించే అవకాశం కీర్తికి వచ్చింది. అయితే ఈ సినిమా నుంచి కీర్తి తప్పుకుంది. అజయ్ భార్య పాత్రలో, మధ్య వయసు మహిళగా నటించమని అడగడంతో ఆ సినిమా నుంచి కీర్తి తప్పుకుందని ఆమధ్య వార్తలు వచ్చాయి. 
 
తొలి సినిమాలోనే పెద్ద వయసు గల మహిళ పాత్రలో నటిస్తే ఇకపై వరుసగా అలాంటి అవకాశాలే వస్తాయని కీర్తి భయపడిందట. 'మైదాన్' నుంచి తప్పుకున్నప్పటికీ కీర్తికి మరిన్ని అవకాశాలు వస్తున్నాయట. లాక్‌డౌన్ తర్వాత కీర్తి బాలీవుడ్ ఎంట్రీ సినిమాపై ఆమె ఓ స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.