శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: శనివారం, 1 జూన్ 2019 (21:41 IST)

ఆ అనుభవంతో కొన్ని పాఠాలు నేర్చుకున్నా.. కైరా అద్వానీ

భరత్ అను నేను, వినయ విధేయ రామ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది కైరా అద్వానీ. తెలుగు భాష రాకపోయినా తన హావభావాలతో తెలుగు ప్రేక్షకులను బాగా మెప్పించింది. భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు సరసన నటించి మెప్పించింది. ఆ తరువాత తెలుగులో పెద్ద అవకాశాలు కైరా అద్వానీకి రాలేదు. అయినా సరే అవకాశాలు దానికదే వస్తాయన్న నమ్మకంతో ఉంది కైరా అద్వానీ.
 
హిందీ రీమేక్ అర్జున్ రెడ్డి సినిమాలో ప్రస్తుతం నటిస్తోంది. కైరా అద్వానీ ఈ మధ్యకాలంలో చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. మనం తప్పు చేస్తాం. అది మామూలే. అయినంత మాత్రాన ఆ తప్పును మర్చిపోవడానికి శాయశక్తులా ప్రయత్నించాలి. ఒకసారి మరిచిపోయిన తరువాత మళ్ళీ దాని గురించి ఆలోచించకూడదు. మనం అనుభవించిన కొన్ని ఇబ్బందులను మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటే అది మనకే నష్టం.
 
అందుకే నేను దేన్నయినా లైట్ తీసుకుంటాం. ఒకవేళ ఎక్కడైనా ఇబ్బండి పడి ఉంటే ఆ అనుభవాన్ని ఒక పాఠంగా తీసుకుని మర్చిపోతూ ఉంటా. అంతే కాదు పదేపదే అదే విషయాన్ని గుర్తుచేసుకుంటూ ఉండనంటోంది కైరా అద్వానీ. హీరోయిన్లకు ఎప్పుడూ సినిమాల్లో నటించడమంటే ఒత్తిడి ఉంటుంది. అలాంటి ఒత్తిడిలో ఉన్నప్పుడు షూటింగ్ అయిన తరువాత పూర్తిగా మనల్ని మనం హీరోయిన్ అన్న విషయాన్ని మర్చిపోయి రిలాక్స్ అవ్వాలి. ఒకవేళ షూటింగ్‌లో పొరపాట్లు జరిగి ఉంటే మళ్ళీ అలాంటివి జరుగకుండా జాగ్రత్తపడాలి. అంతేతప్ప తప్పు జరిగిపోయిందని బాధపడుతూ కూర్చుంటే మాత్రం ఇబ్బందిపడక తప్పందంటోంది కైరా అద్వానీ.