బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (17:27 IST)

కైరా అద్వానీ బాయ్‌ఫ్రెండ్‌తో ఆ పార్టీకి వెళ్లిందట..?

బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది కైరా అద్వానీ. తెలుగులో రెండు సినిమాలు చేసిన కైరా.. కబీర్‌సింగ్‌తో బాలీవుడ్‌లో పాపులర్ అయింది. వరుస అవకాశాలు దక్కించుకుంటూ క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. మరోవైపు తన ప్రేమ వ్యవహారంతో వార్తల్లో నిలుస్తోంది. బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కైరా ప్రేమాయణం సాగిస్తున్నట్టు ఏడాది నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటివరకు వీరిద్దరూ ఆ వార్తలపై స్పందించలేదు.
 
ఇటీవల వీరిద్దరూ కలిసి మాల్దీవులకు విహార యాత్రలకు వెళుతూ కెమేరాలకు చిక్కారు. తాజాగా మరోసారి వీరిద్దరూ కలిసి కనిపించారు. బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ తన కవల పిల్లలు యశ్‌, రూహిల బర్త్‌డే వేడుకలను ఆదివారం సాయంత్రం ఘనంగా సెలబ్రేట్ చేశాడు. 
 
ఈ వేడుకకు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ పార్టీకి కైరా, సిద్ధార్థ్ జంటగా హాజరయ్యారు. ఒకే కారులో పార్టీకి వచ్చిన వీరిద్దరూ తిరిగి అదే కారులో వెళ్లిపోయారు. ఆ క్రమంలో కెమేరాల కళ్లకు చిక్కారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.