శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: మంగళవారం, 10 మార్చి 2020 (20:34 IST)

అది నేర్చుకోవడమంటే చాలా ఇష్టమంటున్న మాళవికాశర్మ

మాళవికాశర్మ. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోయినా నేల టిక్కెట్ సినిమా చూసిన వారికి బాగా గుర్తుంటుంది. మాళవికాశర్మకు కొత్త కొత్త విద్యలు నేర్వడమంటే అమితానందంగా ఉంటుందట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా అందరికీ చెబుతోంది.
 
బాక్సింగ్, డ్యాన్సింగ్ నేర్చిన మాళవికాశర్మ ఇప్పుడు కథక్ నాట్యంలో శిక్షణ తీసుకుంటోందట. నాకు డ్యాన్స్ అంటే ఎప్పుడూ ఇష్టంగానే ఉంటుంది. కథక్ నేర్చుకోవడం వల్ల నా సినిమాల్లో సరైన పద్థతిలో డ్యాన్స్ చేయడానికి ఉపకరించడమే కాకుండా నా హావభావాలను చక్కగా పలికించడానికి దోహదపడుతోందంటోంది మాళవిక.
 
ఎక్కువ సమయం వీటిని కేటాయించడానికే నాకు ఎక్కువ ఇష్టం. ఆ రెండింటిని నేర్చుకోవడమంటేనే నాకు చాలా ఇష్టమని చెబుతోందట. ప్రస్తుతం రెడీ సినిమాలో మళ్ళీ తెలుగు ప్రేక్షకులను పలుకరించడానికి సిద్ధమవుతోంది మాళవికా.