సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : సోమవారం, 28 ఆగస్టు 2017 (13:34 IST)

ఇటలీలో సుహాసిని మణిరత్నం కుమారుడిపై దొంగలదాడి.. దోపిడి

సినీ నటి సుహాసిని, దర్శక దిగ్గజం మణిరత్నం దంపతుల కుమారుడు నందన్‌‍ ఇటలీలో దోపిడీకి గురయ్యాడు. అతనిపై కొందరు దొంగలు దాడి చేసి అతనివద్ద ఉన్న సొమ్మంతా దోచుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరి

సినీ నటి సుహాసిని, దర్శక దిగ్గజం మణిరత్నం దంపతుల కుమారుడు నందన్‌‍ ఇటలీలో దోపిడీకి గురయ్యాడు. అతనిపై కొందరు దొంగలు దాడి చేసి అతనివద్ద ఉన్న సొమ్మంతా దోచుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఇటలీలోని వెనిస్ నగరంలో ఉన్న నందన్‌ ఓ హోటల్ వద్ద నిలబడివుండగా కొందరు వ్యక్తులు అతనిపై దాడి చేసి చేతిలో ఉన్న డబ్బంతా దోచుకుని పారిపోయారు. దీంతో అతను సమీపంలోని ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోవడం కూడా కష్టమైంది. 
 
ఈ విషయం తెలుసుకున్న సుహాసిని వెంటనే స్పందించి ట్విట్టర్ ద్వారా విషయాన్ని తెలుపుతూ.. వెనిస్ ఎయిర్‌పోర్ట్‌ దగ్గరలోని వారెవరైనా సాయం చేయండని కోరింది. దీంతో అక్కడివారు నందన్‌కి కావాల్సిన సహాయం అందించడంతో అతను సురక్షితంగా హోటల్‌కి చేరుకున్నాడు. సహాయం అందించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సుహాసిని ట్వీట్ చేశారు.