సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 21 జూన్ 2022 (06:25 IST)

ఎన్‌.టి.ఆర్‌. చిత్రంలో హీరోయిన్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్‌!

ntr31 look
ntr31 look
ఆర్‌.ఆర్‌.ఆర్‌. త‌ర్వాత ఎన్టీఆర్ ఓ భారీ యాక్షన్ డ్రామా చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్ లుక్‌కూడా విడుద‌ల‌చేశారు. కె.జి.ఎఫ్‌. ద‌ర్శ‌కుడు ప్రశాంత్ నీల్ డైరెక్ష‌న్ చేస్తున్నారు. వ‌ర్కింగ్ టైటిల్‌గా ఎన్టీఆర్ 31వ సినిమా పేరుతో ఇటీవ‌లే లుక్ విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా బాలీవుడ్ భామ దీపికా పదుకొణె హీరోయిన్‌గా తీసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆస‌క్తిక‌ర‌మైన పేరు బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆమె ఎవ‌రోకాదు. అల‌నాటి శ్రీ‌దేవి కూతురు జాన్వీ కపూర్.
 
ఇప్ప‌టికే ఆమె తెలుగులో ఎంట్రీకి సిద్ధ‌మైంద‌ని టాక్ ఫిలింన‌గ‌ర్‌లో వినిపిస్తోంది. గ‌తంలో ఎన్‌.టి.ఆర్‌., శ్రీ‌దేవి కాంబినేష‌న్ హిట్ చిత్రాలు వ‌చ్చాయి. ఇప్పుడు ఆయ‌న వార‌సుడిగా ఈ ఎన్‌.టి.ఆర్‌.తో త‌మ కుమార్తెను న‌టించాల‌ని శ్రీ‌దేవికి కోరిక‌గా వుండేది. దాన్ని ఆయ‌న భ‌ర్త బోనీక‌పూర్ నిజం చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమా  రెగ్యులర్ చిత్రీక‌ర‌ణ  ప్రశాంత్ నీల్ నవంబర్ నుంచి ప్లాన్ చేస్తున్నాడు. నవంబర్ సెకండ్ వీక్ నుంచి ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లనుంది.