ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 జనవరి 2021 (17:40 IST)

సమంతను వద్దంటున్న నాగచైతన్య - మరో అమ్మాయిపై కన్ను?

టాలీవుడ్ సెలెబ్రిటీ దంపతుల్లో అక్కినేని నాగచైతన్య - సమంత దంపతులు ఉన్నారు. వీరిద్దరూ పెళ్లికి ముందుకు కలిసి నటించారు. పెళ్లి తర్వాత కూడా నటిస్తున్నారు. అయితే, పెళ్లి తర్వాత కలిసి నటించిన "మజిలీ" చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. 
 
ఈ నేపథ్యంలో మరోసారి వీరిద్దరినీ వెండితెరపై జంటగా చూపించాలని ఓ దర్శకుడు భావించి, సమంత భర్త నాగచైతన్య వద్ద ప్రతిపాదన పెట్టారు. దీనికి ఆయన నో చెప్పారట.
 
నాగచైతన్య ప్రస్తుతం విక్రమ్ కె.కుమార్ రూపొందిస్తున్న'థాంక్యూ'లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నాగచైతన్య ఓ సామాన్య కుర్రాడిగా, బిజినెస్‌మేన్‌గా కనిపించబోతున్నాడట. హీరోయిన్ పాత్రకు కూడా చాలా ప్రాముఖ్యం ఉందట. 
 
ఆ రోల్‌కు సమంతను తీసుకుందామని విక్రమ్ ప్రపోజ్ చేశాడట. అయితే చైతన్య మాత్రం వద్దన్నాడట. ఈ మధ్యనే తామిద్దరం కలిసి ఓ సినిమా చేశామని, ఇప్పట్లో మళ్లీ వద్దని, వేరే హీరోయిన్‌ను చూడమని చెప్పాడట. దీంతో చిత్ర యూనిట్ హీరోయిన్ అన్వేషణలో పడిందట. 
 
టాలీవుడ్‌లో సూపర్ హిట్ కాంబినేషన్‌గా గుర్తింపు పొందిన చై - సమంత జంట... మరో చిత్రంలో తన భార్యతో కలిసి నటించేందుకు నాగ చైతన్య ఎందుకు నో చెప్పారన్నది మాత్రం సస్పెన్స్‌గా ఉంది.
 
కాగా, గతంలో విక్రమ్ కె.కపూర్ దర్శకత్వంలో వచ్చిన మనం చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధించిన విషయం తెల్సిందే. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వర రావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ అక్కినేని, సమంతలు నటించారు.