గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 11 జనవరి 2020 (03:28 IST)

సమత కేసు విచారణ ఈ నెల 20కి వాయిదా

సమత కేసు విచారణ ఈనెల 20కి వాయిదా పడింది. నిందితుల తరఫున న్యాయవాది రహీం వాదనలు వినిపించారు. తదుపరి వాదనలు వినేందుకు ప్రత్యేక న్యాయస్థానం ఈనెల 20కి వాయిదా వేసింది. సమత హత్యాచారం కేసులో విచారణ ఈ నెల 20కి వాయిదా పడింది. నిందితుల తరఫున న్యాయవాది రహీం వాదనలు వినిపించారు.

ఈ కేసుకు సంబంధించిన పబ్లిక్​ ప్రాసిక్యూటర్​ వేరే కేసు విచారణలో ఉండటం వల్ల కోర్టుకు హాజరుకాలేదు. తదుపరి వాదనలు వినేందుకు ప్రత్యేక కోర్టు 20కి వాయిదా వేసింది. ఆదిలాబాద్‌ కోర్టు నుంచి నిందితులను జైలుకు తరలించారు. ఇప్పటికే ప్రత్యేక కోర్టు ప్రాసిక్యూషన్‌ తరఫున మొత్తం 25 మంది సాక్షులను విచారించింది.

నేరారోపణ అభియోగాలపై... జనవరి మూడో తేదీన నిందితులను విచారించింది. వారి తరఫున సాక్షుల వాదనలు వినేందుకూ కోర్టు అంగీకరించినా సాక్షులెవరూ ముందుకు రాలేదు.