గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Modified: సోమవారం, 16 డిశెంబరు 2019 (16:30 IST)

ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుకు సమత హత్యాచారం నిందితులు

కుమురం భీం: గత నెల 24న కుమురం భీం జిల్లాలో హత్యాచారానికి గురైన సమత కేసులో నిందితులకు జ్యూడీషియల్‌ కస్టడీ నేటితో ముగిసింది. దీంతో నిందితులు షేక్‌ బాబు, మఖ్దూం, షాబొద్దీన్‌లను ఆదిలాబాద్‌ జిల్లా జైలు నుంచి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుకు తరలించారు. మరోవైపు నిందితుల తరఫున వాదించకూడదని బార్‌ అసోసియేషన్‌ నిర్ణయించింది. 
 
ఇదే విషయాన్ని న్యాయవాదులు జిల్లా న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో నిందితుల తరఫున వాదించేందుకు ప్రభుత్వమే ఓ న్యాయవాదిని నియమించే అవకాశముంది. మరోవైపు నిందితుల జ్యూడీషియల్‌ కస్టడీని పొడిగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.