సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : బుధవారం, 23 నవంబరు 2016 (11:20 IST)

చైతూతో పెళ్లి.. సమంతకు తగ్గిపోతున్న సినిమా ఆఫర్లు.. త్రివిక్రమ్ కూడా కీర్తిని తీసుకున్నాడు..

సమంతకు ఆఫర్లు తగ్గిపోతున్నాయి. చైతూతో అమ్మడి పెళ్లి కన్ఫామ్ అయిన తర్వాత ఆమెకు ఆఫర్లు సన్నగిల్లుతున్నాయి. సినీ మేకర్స్ సమంతను పక్కనబెట్టినట్లు సమాచారం. రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, కీర్తి సురేష్

సమంతకు ఆఫర్లు తగ్గిపోతున్నాయి. చైతూతో అమ్మడి పెళ్లి కన్ఫామ్ అయిన తర్వాత ఆమెకు ఆఫర్లు సన్నగిల్లుతున్నాయి. సినీ మేకర్స్ సమంతను పక్కనబెట్టినట్లు సమాచారం. రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, కీర్తి సురేష్ వంటి హీరోయిన్ల కోసం నిర్మాతలు ఆఫర్లు ఇచ్చేందుకు ఎగబడుతున్నారు.

ఇలా మిగిలిన హీరోయిన్లు దూసుకుపోతుంటే సమ్మూ చతికిలపడుతోంది. మహేష్ బాబు నుంచి పవన్ కళ్యాణ్ వరకు.. మెగాస్టార్ చిరంజీవి నుంచి బాలయ్య వరకు.. ప్రభాస్ నుంచి సూర్య వరకు అంతా.. తమ మూవీల్లో ఇతర హీరోయిన్లను ఎంపిక చేసుకుంటున్నారు. దీంతో సమంతకు ఆఫర్లు సన్నగిల్లాయి. 
 
ఇంకా సమంత పెళ్లి పనుల్లో బిజీగా ఉంటే.. షూటింగ్స్‌కు బ్రేక్ పడే అవకాశం ఉందని డైరక్టర్లు ఆమెను హీరోయిన్‌గా తీసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారు. పెద్ద సినిమాల విషయానికొస్తే-మహేష్ బాబు మురుగదాస్ ప్రాజెక్టు‌లో రకుల్ హీరోయిన్.

అలాగే బాలయ్య గౌతమీ పుత్ర శాత కర్ణిలో శ్రియా శరణ్.. బాహుబలి-2లో అనుష్క, కాటమరాయుడులో శృతి హసన్ వంటి వారున్నారు. అలాగే పవన్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కే కొత్త సినిమాలో కీర్తి సురేష్ ఎంపికైంది. పెళ్లి పనుల్లో ఉన్న సమంతను డిస్టబ్ చేయకూడదని త్రివిక్రమ్ కూడా కీర్తి సురేష్‌ను ఎంపిక చేసున్నాడు.