సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్

ఫ్యాంట్ జిప్ ఓపెన్ చేసి బలవంతం చేయబోయాడు : పాయల్ ఘోష్

బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య కేసు అనేక కీలక మలుపులు తిరుగుతోంది. సుశాంత్ ఆత్మహత్యకు అసలు కారణం ఏంటో తెలియదుగానీ, డ్రగ్స్ వ్యవహారం, కంగనా రనౌత్ వ్యవహారం మాత్రం ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. ఫలితంగా బాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయి, ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకుంటున్నారు. 
 
ఈ క్రమంలో బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించింది. "అనురాగ్ తనను బలవంతం చేయబోయాడంటూ ఆరోపించింది. ఈ విషయంలో చర్య తీసుకోండి. కశ్యప్‌లోని రాక్షస కోణాన్ని ప్రజలకు చూపెట్టండి. ఇలా వెల్లడించడం నాకు హాని చేస్తుందని, నా భద్రతకు ముప్పు అని నాకు తెలుసు. సాయం చేయండి" అంటూ ప్రధాని నరేంద్ర మోడీని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వేడుకుంది. 
 
నిజానికి బాలీవుడ్‌లో కంగనా రనౌత్‌కు, అనురాగ్ కశ్యప్‌కు మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. మధ్యలో పాయల్ ఘోష్ చొరబడటం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. పాయల్ చేసిన ఆరోపణలపై అనురాగ్ స్పందించాడు. "నా నోరుని మూసివేసే ప్ర‌య‌త్నం బాగానే జ‌రుగుతుంది. ఇందుకు కొంత స‌మ‌యం పట్టింది. నా నోరు మూసివేయించే ప్ర‌య‌త్నంలో చాలా మంది మ‌హిళ‌ల‌ను లాగారు. కొంత కంట్రోల్‌గా ఉండండి. ఆధారాలు లేని కామెంట్స్ చేయకండి" అంటూ కామెంట్స్ చేశాడు.