శనివారం, 23 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 జూన్ 2020 (17:02 IST)

హీరోయిన్లను వారు దేవతల్లా చూస్తున్నారు.. బాలీవుడ్‌ కంటే అదే బెటర్

Payal Ghosh
బాలీవుడ్‌ కంటే దక్షిణాది సినీ ఇండస్ట్రీ బెటరని హీరోయిన్ పాయల్ ఘోష్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే బాలీవుడ్‌లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యతో నెపోటిజంపై దుమారం రేగిన నేపథ్యంలో దక్షిణాది సినిమా ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్‌పై పాయల్ ఘోష్ పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
 
దక్షిణాది సినిమాల్లో నటించిన వారిని బాలీవుడ్‌లో చిన్నచూపు చూస్తారని తెలిపింది. ఆమె తెలుగులో కొన్ని సినిమాల్లో నటించింది. అనంతరం బాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాయల్ మాట్లాడుతూ.. బాలీవుడ్‌తో పోల్చితే దక్షిణాది చిత్రాల్లోనే హీరోయిన్లను బాగా గౌరవిస్తారని తెలిపింది. 
 
దక్షిణాది సినిమాల్లో నటించిన వారిని బాలీవుడ్‌లో చిన్నచూపు చూస్తుందని పాయల్ వెల్లడించింది. బాలీవుడ్‌లో నటించే అవకాశం కోసం ప్రయత్నిస్తుంటే దక్షిణాది సినిమాల్లో నటించానన్న విషయాన్ని చెప్పొద్దని తనకు కొందరు సలహాలు ఇచ్చారని తెలిపింది. ఈ పరిణామాలతో బాలీవుడ్ కంటే దక్షిణాది సినిమాల కోసం ప్రయత్నాలు జరపితేనే బాగుంటుందని తనకు అనిపిస్తోందని పాయల్ అభిప్రాయం వ్యక్తం చేసింది. 
 
తమిళ, తెలుగుతో కూడిన దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటించే హీరోయిన్ల పట్ల బాలీవుడ్‌కు చిన్నచూపు వుందని చెప్పుకొచ్చింది. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్‌తో ఊసరవెల్లిలో నటించిన ఈ భామ తమిళ, హిందీ సినిమాల్లో కూడా నటించింది.

దక్షిణాది దర్శకులు నిజాయితీగా వున్నారని.. హీరోయిన్లను దేవతల్లా చూస్తున్నారని.. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ప్రస్తుతం దక్షిణాది సినిమాలపై ఆధారపడి వుందని.. దక్షిణాదికి చెందిన పలు సినిమాలను హిందీలో రీమేక్ అవుతున్న విషయాన్ని పాయల్ ఘోష్ గుర్తు చేసింది.