శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 జూన్ 2020 (14:58 IST)

బాలీవుడ్‌కు అలా వెళ్ళనున్న సమంత?

అక్కినేని నాగార్జున కోడలు, టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత బాలీవుడ్ ఎంట్రీ ఖాయమైంది. సమంత అక్కినేని తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను సమంత.. నాగచైతన్యనే ప్రేమించి వివాహం చేసుకుంది. 
 
ఇటీవల శర్వానంద్‌తో సమంత కలిసి నటించిన 'జాను' ఆ మధ్య విడుదలై బాక్సాఫీస్ దగ్గర తుస్సుమంది. అయినా అంతకుముందు సినిమాలన్నీ బంపర్ హిట్ అయ్యాయి. తాజాగా సమంత బాలీవుడ్ అరంగేట్రం చేయనుంది. అదీ వెబ్ సిరీస్ ద్వారా. సమంత ఇటు సినిమాల్లో నటిస్తూనే అమేజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే 'ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్‌లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌ను సోనీ పిక్చర్స్ తెరకెక్కిస్తోంది. 
 
ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనుంది. ఈ సినిమా షూటింగ్ మార్చి నుంచి జరుగాల్సీ వుంది కానీ కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఇది కేవలం హారర్ చిత్రమే కాదనీ, అంతకు మించిన విషయమున్న చిత్రమని సమంత పేర్కొంది. తెలుగు, తమిళ భాషల్లో ఇది రూపొందుతుంది.