శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By
Last Updated : గురువారం, 31 జనవరి 2019 (11:02 IST)

''సీత'' కోసం పాయల్ రాజ్‌పుత్.. ఏం చేసిందంటే?

ఆరెక్స్ 100 సినిమాలో అందాలను ఆరబోసి.. యూత్‌కు బాగా కనెక్ట్ అయిన పాయల్ రాజ్‌పుత్ ప్రస్తుతం ఐటమ్ సాంగ్ చేసేందుకు సై అంటోంది. తాజాగా తేజ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రధారిగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో కాజల్ జోడీగా బెల్లంకొండ శ్రీనివాస్ ''రామ్'' పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. 
 
ప్రస్తుతం ఈ చిత్రంలో హాట్ హాట్ ఐటమ్ సాంగులో పాయల్ స్టెప్పులేయనుందని టాక్. తేజ అడిగిన వెంటనే పాయల్ ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. త్వరలోనే ఈ సినిమాలోని పాయల్ పాట షూటింగ్ శరవేగంగా జరుగనుందని.. ఇందుకోసం పాయల్ భారీగా పారితోషికం తీసుకుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.