గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (19:02 IST)

పెదకాపు 1 వర్సెస్‌ స్కంద నిర్మాతల మధ్య గొడవకు కారకులు ఆ వ్యక్తేనా !

Skanda- pedakapu
Skanda- pedakapu
అఖండ నిర్మించిన రవీందర్‌ రెడ్డి తాజాగా నిర్మించిన సినిమా పెదకాపు 1. తన బావమరిది విరాట్‌ కర్ణను హీరోగా పెట్టి దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాలతో రూపొందించారు. రెండు పార్ట్‌లుగా ఈ సినిమాను కథపై వున్న నమ్మకంతో ప్లాన్‌ చేశారు. ఇక రిలీజ్‌ డేట్‌ వచ్చేసరికి సెప్టెంబర్‌లో సలార్‌ వస్తుందన్న అనుమానంతో వాయిదా వేసుకున్నారు. కానీ సలార్‌ డేట్‌ వాయిదా పడడంతో సెప్టెంబర్‌ 15న రావాలనుకున్నారట. ఇక సలార్‌ రాకపోవడంతో రామ్‌ పోతినేని, బోయపాటి సినిమా స్కంద సెప్టెంబర్‌లో వస్తుందని ప్రకటించారు.
 
దాంతో, స్కంద డేట్‌ విషయమై నిర్మాత శ్రీనివాస్‌ చిట్టూరిని పెదకాపు నిర్మాత రవీందర్‌రెడ్డి ఫోన్‌లో సంప్రదించారట. మా సినిమాను సెప్టెంబర్‌ 29న విడుదల చేయాలనుకుంటున్నాం. మరి మీ స్కంద రిలీజ్‌ డేట్‌ ఎప్పుడుంటుంది అని వాకబు చేశారు. సెప్టెంబర్‌ 15న అనుకుంటున్నామని టోటల్‌ క్లారిటీ రావాలంటే ఒక్కరోజు టైం ఇవ్వండి చెబుతానంటూ.. రవీందర్‌రెడ్డికి ఆయన చెప్పారట. కానీ నాలుగురోజులైనా స్కంద నిర్మాత నుంచి క్లారిటీ రాలేదు. దాంతో ఐదవరోజు మరలా రవీందర్‌రెడ్డి, స్కంద నిర్మాతతో మాట్లాడుతూ, మీ సినిమా విడుదల 28 అని వినబడుతుంది. మీరు అప్పుడు వస్తే మేం సెప్టెంబర్‌ 15న వస్తాం అనగానే. లేదు మేమే 15న వస్తున్నామని శ్రీనివాస్‌ క్లారిటీ ఇచ్చాడట.
 
ఇక వెంటనే పెదకాపు నిర్మాత తమ సినిమా విడుదల తేదీ సెప్టెంబర్‌ 29న ప్రకటించారు. ఆ తర్వాత రోజు వెంటనే స్కంద నిర్మాత తన సినిమాను సెప్టెంబర్‌ 28న వస్తున్నట్లు తెలియజేశారు. దాంతో అవాక్కయిన పెదకాపు నిర్మాతస్కంద నిర్మాతకు ఫోన్ చేస్తే తెయలేదట. చేసేది ఏమీ లేక. డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు ఒత్తిడి మేరకు జరిగి వుంటుందని భావించి సర్దుకున్నారు. అయితే ఈ తంతు అంతా జరిగింది. తెలంగాణలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ వల్లేనని తెలుస్తోంది. అయినా పెదకాపు నిర్మాత ఏదైతే అయిందని అంతా మన మంచికే అంటూ సముదాయించుకున్నారట. ఇవి కొత్త సినిమా నిర్మాతల బాధలు.