శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Updated : శనివారం, 13 జూన్ 2020 (21:42 IST)

సినిమాల్లోకి వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా వదిలేశాానంటున్న పూజా హెగ్డే

పొడుగుకాళ్ళ సుందరి లాక్ డౌన్ సమయంలో కొత్తకొత్త మాటలు మాట్లాడుతోంది. ఖాళీగా ఉన్న సమయంలో అభిమానులతో చాటింగ్ చేస్తూ ఆశక్తికర వ్యాఖ్యలనే చేస్తోంది. కెమెరా ముందు నటించేటప్పుడు మీకు భయం లేదా.. మొదటి సినిమా నటించేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అని ఒక అభిమాని అడిగాడట.
 
ఇందుకు పూజా హెగ్డే.. నాకు సిగ్గు ఎక్కువ. నలుగురిలో మాట్లాడాలన్నా.. నిలబడాలన్నా చాలా సిగ్గు. అయితే ఆ సిగ్గును పూర్తిగా వదిలేశాను. అందుకు కారణం సినిమానే. కెమెరా ముందు నటించడమంటే నాకు పెద్ద కష్టమని ఏమీ అనిపించదు. చాలా ఈజీగా ఇప్పుడు సినిమాల్లో నటించేస్తున్నా.
 
నా క్యారెక్టర్‌ను నేను నటించే సన్నివేశాన్ని డైరెక్టర్ చెప్పినప్పుడు అందులో లీనమైపోతాను. స్క్రిప్ట్ రాసుకున్న తరువాత ఎలా నటించాలా అని నాకు నేనే మాట్లాడుకుంటాను. అంతే కెమెరా ముందు నటించేస్తాను. నాకు ఒక్క టేక్ కూడా అవసరం లేదు. నేను బాగా నటించగలనని చెబుతోంది పూజా హెగ్డే. సినిమాలన్న తరువాత సిగ్గును పూర్తిగా వదిలేయాలంటోంది పూజా హెగ్డే.