మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : గురువారం, 8 ఫిబ్రవరి 2018 (13:36 IST)

ప్రభాస్ సరసన పూజా హెగ్డే.. ''రంగస్థలం'' కోసం అంత తీసుకుందా?

డీజే (దువ్వాడ జగన్నాథమ్) తర్వాత పూజా హెగ్డేకి అవకాశాలు అంతంతమాత్రంగానే వున్నాయి. రంగస్థలం సినిమాల ఓ పాటకు చిందులేసే ఛాన్సును కొట్టేసిన పూజా హెగ్డే.. తాజాగా బాహుబలి సరసన నటించే అవకాశాన్ని కైవసం చేసుకుం

డీజే (దువ్వాడ జగన్నాథమ్) తర్వాత పూజా హెగ్డేకి అవకాశాలు అంతంతమాత్రంగానే వున్నాయి. రంగస్థలం సినిమాల ఓ పాటకు చిందులేసే ఛాన్సును కొట్టేసిన పూజా హెగ్డే.. తాజాగా బాహుబలి సరసన నటించే అవకాశాన్ని కైవసం చేసుకుంది. 
 
ప్రభాస్ హీరోగా ''జిల్'' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్‌గా తీసుకున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అలాగే మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో రూపుదిద్దుకునే చిత్రంలోనూ పూజా హెగ్డే నటించనుందని, ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలోనూ ఆమే హీరోయిన్ అంటూ సినీ జనం అంటున్నారు. 
 
ఇకపోతే.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ''రంగస్థలం'' చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌లో పూజా హెగ్డే డ్యాన్స్ చేసేందుకు సై అంది. ఇందుకో పూజ రూ.50లక్షలు తీసుకుందని సమాచారం. జిల్ జిల్ జిగేల్ అంటూ ఈ పాట సాగుతుందని సినీ యూనిట్ వర్గాల సమాచారం.