ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : శనివారం, 23 డిశెంబరు 2023 (18:34 IST)

సలార్ సినిమా కథను ప్రశాంత్ నీల్ కాపీ కొట్టాడు లేటెస్ట్ అప్ డేట్!

Prabhas action
Prabhas action
పాన్ ఇండియా సినిమాగా ప్రభాస్ నటించిన సలార్ సినిమా ఈ శుక్రవారమే విడుదలై మంచి కలెక్షన్లను రాబట్టింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ లో ఓ జిమ్మిక్కు చేశాడు. ఓ సినిమాను కాపీ కొట్టేశాడు. మామూలుగా సినిమా చూస్తే కె.జి.ఎఫ్. ఫార్మెట్, ఓ హాలీవుడ్ సినిమా డిజైనింగ్ వుంటుంది. అవిసరే అయితే తాజాగా ఆయన కాపీ కొట్టింది ఆయన తీసిన సినిమానే కావఢం విశేషం.
 
వివరాల్లోకి వెళితే, 2014 లో ప్రదీప్ నీల్ దర్శకత్వంలో ఆయన సోదరుడు నిర్మించిన  కన్నడ భాషా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఉగ్రమ్. ఇందులో శ్రీమురళి, హరిప్రియ హీరో హీరోయిన్లు. తిలక్ శేఖర్, అతుల్ కులకర్ణి, అవినాష్ మరియు జై జగదీష్  తదితరులు వున్నారు. 
 
విశేషం ఏమంటే, సలార్ లో చిన్నతనంలో ఫ్లాష్ బ్యాక్, స్నేహితుడు కోసం ఏదైనా చేసే తెగింపు, ఆ తర్వాత ఊరికి దూరంగా మారుమూల గ్రామంలో మెకానిక్ గా హీరో వుండడం, అమెరికా నుంచి హరిప్రియ వస్తే ఆమెకు థ్రెడ్ వుందంటే హీరో కాపాడి తన అమ్మ పర్మిషన్ తో ఆశ్రయమం ఇవ్వడం, ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ లో కథంతా మక్కికి మక్కి దర్శకుడు దించేశాడు. అయితే ఆయన చేసిన జిమ్మిక్కు ఏమంటే ఈనాటి ట్రెండ్ కు తగినట్లు ఖాన్సార్ అనే బాహుబలి లాంటి సామ్రాజ్యం స్రుష్టించి మాయ చేశాడు. ఇందులో శ్రీమురళి  కూడా చాలా హైట్ ఉంటాడు.
 
ఉగ్రంలో శ్రీమురళి  రౌడీలు వచ్చి హీరోయిన్ ను తీసుకెళుతుంటే చేతకాని వాడిలా వుంటూ, తన తల్లి పర్మిషన్ కోసం వేచి చూడడం, తనలోని ఆవేశం అణచుకొనే క్రమంలో కుడిచేయిను బిగదీసి వుండడం, ఆ చేయి షాట్ యాజ్ టీజ్ సలార్ లో ప్రభాస్ చేత చేయించేశాడు. ఇలా చాలా సన్నివేశాలతో అసలు ఉగ్రం కథనే మార్చి ప్రశాంత్ నీల్ తీసి సక్సెస్ కావడం విశేషంగా ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.