శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : గురువారం, 8 ఫిబ్రవరి 2024 (18:44 IST)

రజనీకాంత్ కోసం లేత చికెన్, మటన్ మాంసంతో విందు భోజనం?

Rajanikant
Rajanikant
సూపర్ స్టార్ రజనీకాంత్ ఫుడ్ డైట్ చాలా సాత్వికాహారం అని తెలిసిందే. కానీ ఆయన మాంసం కూడా తింటాడనీ, అందులోనూ లేతగా వున్న చికెన్, మటన్ చాప్స్ ను రుచి చూస్తాడని టాక్ నెలకొంది. విషయంలోకి వెళితే, నిన్ననే రజనీకాంత్ 170 వ  కొత్త చిత్రం హైదరాబాద్ శివార్లోని రామోజీ ఫిలింసిటీలో ప్రారంభమైంది. లైకా ప్రొడక్షన్ నిర్మిస్తోంది. జై భీమ్ చేసిన టి.జె. జ్నానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్కడ యాక్షన్ సన్నివేశాలు తమిళ ఫైట్ మాస్టర్ల ఆద్వర్యంలో చిత్రీకరణ జరుగుతోంది.
 
ఇదిలా వుండగా, ఫిలిం సిటీలో బయట ఫుడ్ పెద్దగా ఎంకరేజ్ చేయరు. కొన్ని పరిమిత నిబంధనలను బట్టి బయట ఫుడ్ కూడా వస్తుంటుంది. అయితే పిలింసిటీకి దూరంగా బయట నుంచి ముప్పయి కేజీల లేత చికెన్, అంతే నిష్పత్తిలో మటన్ కూడా తీసుకువచ్చారని విశ్వసనీయ సమాచారం. ప్రత్యేకంగా మేక మాంసం అమ్మేవారి దగ్గరకు నవాజ్ చేసే వారి దగ్గరనుంచి మటన్ తీసుకున్నారట. ఇవి రజనీకాంత్ షూటింగ్ కోసం అని చెప్పి కొనుగోలు చేశారని తెలిసింది. అయితే ఇది రజనీకాంత్ కోసం కాదనీ, ఫైటర్లు కోసం ప్రత్యేకంగా ఫుడ్ తీసుకెళ్ళినట్లు తెలిసింది.
 
సహజంగా ఫైటర్లు యూనిట్ తినే ఫుడ్ ను తెలుగు సినిమాలు చేసేవారు తినరు. మిగిలిన చోట్ల ఎలా వున్నా ఇక్కడ వారి డిమాండ్ లు వేరే వుంటాయి. అదీ సంగతి.