సోమవారం, 13 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : గురువారం, 20 ఏప్రియల్ 2017 (10:29 IST)

'బాహుబలి' బడ్జెట్ రూ.2 బిలియన్లు... శివగామి రెమ్యునరేషన్ రూ.కోటి.. ఇదేం న్యాయం జక్కన్నా?

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'బాహుబలి'. రెండు భాగాలుగా వచ్చిన ఈ చిత్రం రెండు బిలియన్ రూపాయల వ్యయంతో తెరకెక్కింది. ఈ చిత్రంలో నటించిన నటీనటులందరికీ భారీ మొత్తంలో పారితోషికం అందిందనే

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'బాహుబలి'. రెండు భాగాలుగా వచ్చిన ఈ చిత్రం రెండు బిలియన్ రూపాయల వ్యయంతో తెరకెక్కింది. ఈ చిత్రంలో నటించిన నటీనటులందరికీ భారీ మొత్తంలో పారితోషికం అందిందనే ప్రచారం జోరుగా సాగింది. ముఖ్యంగా.. హీరో ప్రభాస్, మరో హీరో రానాలతోపాటు.. హీరోయిన్లు అనుష్క, తమన్న, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్‌ ఇలా ప్రతి ఒక్కరికీ బాగానే ఇచ్చారనే ప్రచారం ఉంది. 
 
అయితే, ఇపుడు ఆశ్చర్యకరమైన వార్త ఒకటి బయటకువచ్చింది. ఈ చిత్రంలో శివగామిగా పాత్ర పోషించిన సీనియర్ నటి రమ్యకృష్ణకు ఇచ్చిన రెమ్యునరేషన్ జస్ట్ రూ.కోటి మాత్రమేనట. నిజానికి ఈ పాత్రకోసం తొలుత సీనియర్ నటి శ్రీదేవిని దర్శకుడు రాజమౌళి ఎంపిక చేశారు. ఇందుకోసం ఆమె రూ.5 కోట్లు డిమాండ్ చేయగా, అందుకు ఆయన సరేనన్నారు కూడా. 
 
చివరి నిమిషంలో ఆయన ఎమనుకున్నారో ఏమోగానీ.. శ్రీదేవి స్థానంలో రమ్యకృష్ణ చేరిపోయింది. అయితే రమ్యకృష్ణ ఈ సినిమాకుగాను రూ.కోటి మాత్రమే పారితోషికం ఇచ్చారట. అంత భారీ కాన్వాస్‌తో తెరకెక్కిన సినిమాకు రమ్య పాత్రకు రూ.కోటి అంటే తక్కువేనని అంటున్నారు. ఇంత భారీ బడ్జెట్‌తో తీసిన ఈ చిత్రానికి రమ్యకృష్ణ పాత్ర అత్యంత కీలకం. అలాంటి పాత్రకు కేవలం రూ.కోటి ఇవ్వడం ఏమంటని సినీ విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో జక్కన్న తీరు ఏంబాగోలేదని వారు అంటున్నారు.