శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : బుధవారం, 10 మే 2017 (12:44 IST)

ఖైదీకి మొగుడు కానున్న రానా.. ఉయ్యాలవాడ నర్సింహారెడ్డిలో?

ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి చిత్రంలో బాహుబలి విలన్, దగ్గుబాటి రానా నటించనున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఖైదీ 15 సినిమాకు తర్వాత మెగాస్టార్ చిరంజీవి పీరియాడికల్ మూవీలో నటిస్తున్న

ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి చిత్రంలో బాహుబలి విలన్, దగ్గుబాటి రానా నటించనున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఖైదీ 15 సినిమాకు తర్వాత మెగాస్టార్ చిరంజీవి పీరియాడికల్ మూవీలో నటిస్తున్నారు. ఇందులో ఓ ప్రధాన పాత్రను భల్లాలదేవుడు రానా పోషిస్తున్నట్లు సమాచారం. ఈ రోల్ నరసింహారెడ్డిని ఎదుర్కొనే విధంగా పవర్ ఫుల్‌గా ఉంటుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. 
 
ఉయ్యాలవాడలో రానాది విలన్ క్యారెక్టర్ అయినప్పటికీ.. ఎంతో ప్రాధాన్యతను కలిగివుంటుందని సినీ వర్గాల సమాచారం. ఇప్పటికే రానా చిరంజీవి సినిమా అవకాశం రాగానే నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. 
 
బాహుబలి తరహాలో ఉయ్యాలవాడలోనూ రానా పవర్ ఫుల్ రోల్ పోషిస్తాడని సినీ జనం అంటున్నారు. ఇక రానా- చరణ్ మంచి మిత్రులు. ఈ క్రమంలోనే నిర్మాత చెర్రీ అడగ్గానే రానా చిరంజీవి సినిమాలో నటించేందుకు పచ్చ జెండా ఊపినట్లు సమాచారం.