శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: శుక్రవారం, 27 డిశెంబరు 2019 (21:39 IST)

నాకు అదే ధ్యాస అంటున్న రష్మిక మందన్న

ఒకవైపు తెలుగు, మరోవైపు కన్నడ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది రష్మిక మందన. చేతి నిండా సినిమాలు ఉండడంతో తాను ఇప్పుడు చాలా బిజీ అంటోంది రష్మిక. ఎవరైనా స్నేహితులు మాట్లాడాలనుకుంటే బిజీ అంటూ మెసేజ్ పెట్టేస్తోందట. అయితే సినిమా షూటింగ్‌కు మాత్రం అనుకున్న సమయానికే వెళ్ళిపోతోందట. 
 
సినిమా షూటింగ్ ఉంటుంది.. మూడు రోజులు ఉండాల్సి వస్తుందని డైరెక్టర్ చెబితే వారానికి సరిపడా బట్టలు తెచ్చేస్తుందట రష్మిక. డైరెక్టర్ చెప్పినదాని కన్నా ఎక్కువ రోజులే తన బట్టలను సూట్‌కేసులో పెట్టుకుని వచ్చేస్తుందట. నేను నా ఇంట్లో ఎప్పుడూ సూట్‌కేసులో బట్టలను సర్ది పెట్టుకుని ఉంటాను. ఎందుకంటే ప్రస్తుతం బిజీ షెడ్యూల్లో ఉన్నాను కదా. అందుకే ఇలా చేస్తుంటాను. ఎవ్వరు ఏమనుకున్నా పట్టించుకోను.
 
అలాగే నేను నటించిన సినిమాల గురించి కూడా ఆరా తీస్తుంటాను. సినిమా అయిపోయింది కదా అని ఊరుకోను. ఇక నాకేమీ సంబంధం లేదన్నట్లు వ్యవహరించను. నేను నటించిన సినిమా ఏ విధంగా టాక్ ఉందో.. ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటానంటోంది రష్మిక. తాను నటించిన మరో సినిమా విడుదలయ్యేంత వరకు అదే ధ్యాసలో ఉంటానని చెబుతోంది.