శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 17 డిశెంబరు 2019 (17:00 IST)

మ‌హేష్ కొత్త సాంగ్‌లో ర‌ష్మిక ఆట అదిరిందిగా? దున్నేస్తుందేమో?

సూపర్‌స్టార్‌ మహేష్ బాబు న‌టిస్తున్న తాజా చిత్రం స‌రిలేరు నీకెవ్వ‌రు. ఈ చిత్రాన్ని సక్స‌స్‌ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్ పైన నిర్మిస్తున్నారు. అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్ అయిన ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న‌ రష్మిక మందన్న న‌టిస్తుంది. 
 
ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్నారు. అంద‌రూ ఎంత‌గానో ఎదురుచూస్తున్న రొమాంటిక్ సాంగ్‌ హీ ఈజ్ సో క్యూట్ హీ ఈజ్ సో హాట్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. హీ ఈజ్ సో క్యూట్.. హీ ఈజ్ సో స్వీట్.. హీ ఈజ్ సో హ్యాండ్సమ్.. అంటూ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ గ్లామ‌ర్‌ను పొగిడే ఈ పాట సినిమాలో హీరోయిన్ మనసుని దోచుకున్నాడు కధానాయకుడు అనే సందర్భంలో వచ్చే ఫన్ సాంగ్. 
 
రష్మిక, మహేష్ ఒకరినొకరు ఆటపట్టిస్తూ సాగే ఈ రొమాంటిక్ పాటకి శ్రీమణి అర్థవంత‌మైన‌ సాహిత్యం అందించ‌గా సింగర్ మధుప్రియ చ‌క్క‌గా ఆలపించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన ట్యూన్‌ని కంపోజ్ చేశారు.

క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, అదిరిపోయే డాన్స్ మూమెంట్స్‌తో తన అభిమానులతో పాటు మహేష్ ఫ్యాన్స్‌ను కూడా బాగా ఆకట్టుకుంది రష్మిక. వ‌రుస‌గా సాంగ్స్ రిలీజ్ చేస్తూ... ఆ సాంగ్స్‌తో ఆక‌ట్టుకుంటూ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేస్తున్నారు. అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమాని చూస్తామా అని ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.