నందమూరి హీరో బాలయ్య స్టెప్పులు అదుర్స్

Ruler
సెల్వి| Last Updated: ఆదివారం, 15 డిశెంబరు 2019 (17:55 IST)
నందమూరి నటసింహం ప్రస్తుతం రూలర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈయన వయసు 60కి చేరినా కూడా మనసు మాత్రం ఇంకా 20ల్లోనే ఆగిపోయింది. ఇప్పటికీ అదే ఎనర్జీతో దుమ్ము దులిపేస్తున్నారు.. బాలయ్య. రూలర్ సినిమాలో అదిరిపోయే లుక్‌లో కనిపిస్తున్నారు.

కేయస్ రవికుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదల కానుంది. తాజాగా విడుదలైన ప్రోమో వీడియోలో బాలయ్య డాన్సులు చూసి ఫిదా అవుతున్నారు సినీ ఫ్యాన్స్. అసలు ఈ ఏజ్‌లో ఆయన డాన్సులేంటో అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. పడతాడు తాడు తాడు అంటూ రప్ఫాడించేస్తున్నాడు బాలయ్య.

ఈ ప్రోమో సాంగ్‌లో అదిరిపోయే స్టెప్పులేసాడు నందమూరి హీరో. ఈ సీనియర్ హీరో జోరు చూసి వామ్మో అనుకుంటున్నారు ప్రేక్షకులు. గతంలో కూడా అమ్మకుట్టి అమ్మకుట్టి అంటూ రెచ్చిపోయిన బాలయ్య.. ఇప్పుడు పడతాడు అంటూ చిందులు చించేసాడు. ఈయనతో జానీ మాస్టర్ స్టెప్పులు ఇరగదీసాడు. ఈ పాటలో సోనాల్ చౌహాన్ హీరోయిన్. ఆమె బికినీ సోకులు కూడా సినిమాకు అదనపు ఆకర్షణ. ఇక వేదిక మరో హీరోయిన్. మొత్తానికి బాలయ్య స్పీడ్.. జోరు చూసి అంతా వారెవ్వా అంటున్నారు.
దీనిపై మరింత చదవండి :