శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 8 డిశెంబరు 2019 (11:51 IST)

ఇది సింహంరా... వెంటాడి వేటాడి చంపుద్ది : రూలర్ ట్రైలర్

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 105వ చిత్రం. ఈ చిత్రం పేరు రూరల్. ఈ చిత్రం ట్రైలర్ ఆదివారం విడుదలైంది. ఈ ట్రైలర్‌లో బాలకృష్ణ న్యూలుక్‌తో ‌ మాన్లీగా కనిపిస్తున్నారు. సినిమాకు సంబంధించిన టీజర్, ఓ సాంగ్ విడుదల కాగా, వాటికి నెటిజన్లు, ఫ్యాన్స్ నుంచి మంచి స్పందనే వచ్చింది. 
 
"ఈ ధాన్యం తింటున్న మీరే ఇంత పొగరు చూపిస్తుంటే, దీన్ని పండించిన రైతుకు ఇంకెత పవరు, పొగరు ఉంటుందో చూపించమంటావా?" అన్న బాలయ్య డైలాగ్ థియేటర్లలో విజిల్స్ వేయిస్తుందంటే అతిశయోక్తి కాదు. 
 
"ఇది దెబ్బతిన్న సింహంరా... అంత తొందరగా చావదు. వెంటాడి వేటాడి చంపుద్ది" అన్న డైలాగ్ కూడా ట్రయిలర్‌లో వినిపిస్తుంది. బాలయ్య సరసన వేదిక, సోనాల్ చౌహాన్ నటిస్తుండగా, భూమిక, ప్రకాశ్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. ఈ చిత్రం 20వ తేదీన విడుదల కానుంది. 'రూరల్' ట్రైలర్‌ను మీరూ చూడవచ్చు.