సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : సోమవారం, 2 సెప్టెంబరు 2019 (15:54 IST)

బాల‌య్య 105వ చిత్రం ఎంత వ‌ర‌కు వ‌చ్చింది..? లేటెస్ట్ అప్‌డేట్ ఏంటి..?

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 105వ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌పై కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో సి.కల్యాణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'జైసింహా' వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌ర్వాత ఈ హిట్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న రెండో చిత్ర‌మిది. 
 
ఇటీవ‌ల థాయ్‌లాండ్‌లో తొలి షెడ్యూల్ పూర్త‌య్యింది. సెప్టెంబ‌ర్ 5 నుండి హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో లెంగ్తీ షెడ్యూల్ ప్రారంభ‌మ‌వుతుంది. బాల‌కృష్ణ రెండు డిఫ‌రెంట్ లుక్స్‌లో క‌న‌ప‌డతారు. ఇటీవ‌ల విడుద‌లైన ఓ లుక్‌కి ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. 
 
వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ప్రేక్ష‌కుల‌కు శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేస్తూ రెండు పోస్ట‌ర్స్‌ను యూనిట్ విడుద‌ల చేసింది. సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్‌ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సి.రామ్‌ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.