శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 4 మార్చి 2024 (20:49 IST)

జాతిరత్నాల దర్శకుడితో రవితేజ

Ravi teja
Ravi teja
మాస్ మహరాజా రవితేజ సినిమాలతో బిగా వున్నాడు. రవితేజ చివరిసారిగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈగిల్‌లో కనిపించాడు. ప్రస్తుతం రవితేజ హరీష్ శంకర్ దర్శకత్వంలో తన కొత్త సినిమా మిస్టర్ బచ్చన్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్ హిందీలో హిట్ అయిన రైడ్‌కి అధికారిక రీమేక్. ఈ సినిమాలో రవితేజ ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నాడు.
 
తాజాగా జాతి రత్నాలు డైరెక్టర్‌ అనుదీప్ సినిమా కూడా ఓకే చేశాడు. ఇది ఒక క్రేజీ కామెడీ చిత్రమనీ, వచ్చే నెలలో గ్రాండ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభించబడుతుందని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. మిస్టర్ బచ్చన్‌తో రవితేజ పూర్తి చేసిన తర్వాత, ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్ళనుందని సమాచారం.