1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 15 ఫిబ్రవరి 2024 (17:45 IST)

సుందరం మాస్టర్ కథ వినగానే దివ్య శ్రీపాద రియాక్షన్ !

Divya Sripada, Harsha Chemudu
Divya Sripada, Harsha Chemudu
రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మిస్తున్న చిత్రం 'సుందరం మాస్టర్'. ఈ చిత్రంలో హర్ష చెముడు, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలు పోషించారు. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 23న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రైలర్‌ను రిలీజ్ అయింది.
 
వీడియో సందేశం ద్వారా చిరంజీవి మాట్లాడుతూ.. ‘ ‘సుందరం మాస్టర్’ ట్రైలర్ చాలా బాగుంది. హర్ష కోసమే ఈ పాత్ర పుట్టినట్టుగా ఉంది. తనకు తాను, తన టాలెంట్‌ను తాను నమ్ముకుని హర్ష ఈ స్థాయికి వచ్చాడు. ఈ రోజు హీరో స్థాయికి ఎదిగాడు. హర్షను నమ్మి నిర్మాత సుధీర్, దర్శకుడు కళ్యాణ్ సంతోష్ ఈ చిత్రాన్ని తీశారు. ఆసాంతం వినోదాత్మకంగా ఈ చిత్రం ఉంటుందని అర్థం అవుతోంది. కామెడీనే కాకుండా ఎమోషన్ కూడా ఇందులో ఉందని చెబుతున్నారు. ఇలాంటి వినూత్న ప్రయోగాలను ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలి’ అని అన్నారు.
 
హర్ష చెముడు మాట్లాడుతూ.. ‘మా లాంటి కొత్త వాళ్లని, చిన్న సినిమాను ఎంకరేజ్ చేస్తూ ట్రైలర్ రిలీజ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి గారికి థాంక్స్. సుందరం మాస్టర్ సినిమా చాలా కొత్త పాయింట్‌తో రాబోతోంది. నేను ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లు అవుతోంది. ప్రతీ సారి ఏదో కొత్తగా చేయాలని ప్రయత్నిస్తుంటాను. ఈ కథ నా దగ్గరకు వచ్చింది. నాకు నచ్చింది.. కాబట్టి చేశాను. నేను చేయగలిగిన పాత్రలే ఉంటే తప్పకుండా చేస్తాను. సుందరం మాస్టర్ పాత్రను చూస్తే మనలో ఒకరిని చూసినట్టుగానే అనిపిస్తుంది. ఈ చిత్రాన్ని థియేటర్లో చూస్తేనే మజా వస్తుంది. అందరినీ ఆలోచింపజేసే చిత్రం అవుతుంది. కామెడీనే కాకుండా అద్భుతమైన డ్రామా కూడా ఉంటుంది. ఈ సినిమా కోసం టీం అంతా చాలా కష్టపడింది. నేచురల్ లొకేషన్‌కు వెళ్లి షూటింగ్ చేశాం. ప్రతీ పాత్రకు ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది. మా సినిమాను ఆడియెన్స్ తప్పకుండా చూసి ఆదరించాల’ని అన్నారు.
 
దివ్య శ్రీపాద మాట్లాడుతూ.. ‘ట్రైలర్ అందరికీ నచ్చుతుంది. ఫీమేల్ లీడ్‌గా ఇది నా మొదటి థియేట్రికల్ రిలీజ్. హర్ష ద్వారా ఈ కథ విన్నాను. విన్న వెంటనే బాగా నచ్చింది. హిట్ అవుతుందని అప్పుడే ఫిక్స్ అయి కంగ్రాట్స్ కూడా చెప్పాను. హర్ష ఈ చిత్రంతో అందరికీ గుర్తుండిపోతాడు. సుందరం మాస్టారు చాలా రోజులు గుర్తుంటాడు. మైనా అనే ఇంత మంచి పాత్రను రాసినందుకు, ఆ పాత్రను నాకు ఇచ్చిన దర్శకుడికి థాంక్స్. అందరూ మా సినిమాను తప్పకుండా చూడండి’ అని అన్నారు.