గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 5 జులై 2023 (11:07 IST)

స్పై సినిమా హీరో నిఖిల్‌ ప్రేక్షకులకు క్షమాపణ

spy latest poster
spy latest poster
నిఖిల్‌ పాన్‌ ఇండియా సినిమా అని రిలీజ్‌ చేసిన స్పై చిత్రం విడుదల తర్వాత డివైడ్‌ టాక్‌ వచ్చింది. కానీ రోజు రోజు కలెక్షన్ అదుర్స్ అని పోస్టర్లు కూడా విడుదల చేశారు. ఓవర్ సీస్ బ్రహ్మాండం అన్నారు. కానీ ఈరోజు తిరుగుటపా అన్నారు. అంటే ఇప్పటివరకు ఫేక్ రిపోర్ట్స్ అని తేలిపోయింది.  ఈ సినిమాను ఇతర భాషల్లోనూ విడుదలచేస్తున్నట్లు మొదట చెప్పారు. కానీ తొలుత తెలుగులోనే రిలీజ్‌ అని విడుదలకు ముందు తెలిపారు. తమిళ, మలయాళం, కన్నడ డబ్బింగ్‌లో వున్నాయని, హిందీలో టైం సరిపోవడంలేదని అన్నారు. ఇక ఓవర్‌సీస్‌లో కూడా ఈ సినిమాను బ్రహ్మాండంగా విడుదలచేయాలని చూశారు. ఓవర్ సీస్ లో 594+ కౌంటింగ్ అని పోస్టర్ విడుదల చేశారు. కానీ షెడెన్‌గా ఈరోజు జులై 5న హీరో నిఖిల్‌ ఓ ప్రకటన జారీ చేశారు. ఓవర్‌సీస్‌లో 350 తెలుగు ప్రీమియర్‌ షోను కాన్సిల్‌ చేయడం జరిగిందని తెలిపారు.
 
స్పై సినిమాను ప్రోపర్‌గా విడుదల చేయడంలో ఫెయిల్‌ అయ్యాం. ఓవర్ సీస్ లో పరిమితంగా విడుదల అయింది. హిందీలో మల్టీప్లెక్స్ లో చేయలేక పోయాము. ఇండియాలో అన్ని భాషల్లో విడుదల అనుకున్నా కంటెంట్‌ డిలే వల్ల చేయలేకపోయామని పేర్కొన్నారు. అందుకే హిందీ, కన్నడ, తమిళ, మలయాళం ప్రేక్షకులకు నేను క్షమాపణ తెలియజేస్తున్నానని ప్రకటించారు.  కార్తికేయ2 తర్వాత నా అప్‌కమింగ్‌ మూడు సినిమాలు అన్ని భాషల్లో విడుదలచేయానుకున్నా టైం కలిసిరాలేదన్నారు.