శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: సోమవారం, 19 డిశెంబరు 2016 (20:39 IST)

వర్మ కోసం బాహుబలి అగ్రిమెంటు రూల్ ప్రభాస్ అతిక్రమిస్తున్నాడా?

బాహుబలి కంక్లూజన్ చిత్రం షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ చిత్ర దర్శకుడు రాజమౌళి విధించిన నియమాల ప్రకారం చిత్రం షూటింగులో పాల్గొంటున్న నటీనటులు ఎవరూ ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ, పబ్లిక్ మీటింగులలో పాల్గొనడం కానీ చేయకూడదు. ఐతే ఈ నిబంధనను హీరో ప్రభాస్ అతిక్ర

బాహుబలి కంక్లూజన్ చిత్రం షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ చిత్ర దర్శకుడు రాజమౌళి విధించిన నియమాల ప్రకారం చిత్రం షూటింగులో పాల్గొంటున్న నటీనటులు ఎవరూ ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ, పబ్లిక్ మీటింగులలో పాల్గొనడం కానీ చేయకూడదు. ఐతే ఈ నిబంధనను హీరో ప్రభాస్ అతిక్రమిస్తున్నట్లు టాలీవుడ్ న్యూస్. ఐతే అది కూడా రాజమౌళి అనుమతితోనే. 
 
ఇంతకీ విషయం ఏంటయా అంటే... మంగళవారం నాడు రాంగోపాల్ వర్మ శివ టు వంగవీటి ప్రోగ్రాము హైదరాబాదులో జరుగనుంది. ఈ కార్యక్రమానికి బిగ్ బి అమితాబ్, నాగార్జున ముఖ్య అతిథులుగా రానున్నారు. ఇంకా నాగ్ ఫ్యామిలీ హీరోలు వస్తున్నట్లు సమాచారం. ఇదే కార్యక్రమానికి రావలసిందిగా ప్రభాస్, రాజమౌళిని కూడా వర్మ ఆహ్వానించారు. ప్రభాస్ పాల్గొనేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆ ప్రకారం చూస్తే బాహుబలి అగ్రిమెంటు నిబంధనను ప్రభాస్ అతిక్రమిస్తున్నట్లే అనుకోవాలి.