ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: సోమవారం, 20 ఆగస్టు 2018 (15:04 IST)

100 కోట్లిచ్చినా ఆ క్యారెక్టర్ చేయనంటున్న సాయిపల్లవి...?

భారీగా పారితోషికం ఇస్తామంటే ఐటెం సాంగ్స్ చేసేందుకు సిద్ధమవుతున్నారు కొందరు బడా హీరోయిన్లు. అయితే సాయిపల్లవి మాత్రం డబుల్ రెమ్యునరేషన్ ఇస్తామన్నా ఒక సినిమాలో ఒప్పుకోవడం లేదట. ఒక యువహీరో సినిమాను రిజెక్ట్స్ చేసిందట సాయిపల్లవి. ఇప్పుడు ఇదే తెలుగు సినీపర

భారీగా పారితోషికం ఇస్తామంటే ఐటెం సాంగ్స్ చేసేందుకు సిద్ధమవుతున్నారు కొందరు బడా హీరోయిన్లు. అయితే సాయిపల్లవి మాత్రం డబుల్ రెమ్యునరేషన్ ఇస్తామన్నా ఒక సినిమాలో ఒప్పుకోవడం లేదట. ఒక యువహీరో సినిమాను రిజెక్ట్స్ చేసిందట సాయిపల్లవి. ఇప్పుడు ఇదే తెలుగు సినీపరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారుతోంది.
 
మనీ కాదు గోల్ ముఖ్యమంటోంది సాయిపల్లవి. మిగిలిన హీరోయిన్లకు తాను పూర్తి భిన్నమని చెబుతోంది ఫిదా హీరోయిన్. రెండు కోట్ల రూపాయల పారితోషికం ఇచ్చినా రోల్ నచ్చడం లేదని తిరస్కరించిందట. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సినిమాలో మొదటి హీరోయిన్‌గా కాజల్ నటిస్తోంది. ఈ సినిమాలో రెండవ హీరోయిన్ పాత్ర కోసం పలువురు భామలను పరిశీలించారు. కానీ ఫిదా హీరోయిన్ సినిమాలో నటిస్తే బాగుంటుందని హీరో భావించారు.
 
యూత్‌లో క్రేజ్ ఉన్న సాయిపల్లవిని రెండో హీరోయిన్‌గా తీసుకుంటే బాగుంటుందని అందరూ భావించారు. ఇదే విషయాన్ని అడిగితే సాయిపల్లవి ఒప్పుకోలేదట. తనకు ప్రాధాన్యత లేని క్యారెక్టర్ ఇస్తే అస్సలు ఇష్టం లేదని, 100 కోట్లు ఇచ్చినా ఆ క్యారెక్టర్ చేయనని ముఖంమీదే చెప్పేసిందట సాయిపల్లవి. ఇప్పుడు ఇదే విషయం తెలుగు సినీపరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారుతోంది.