శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By
Last Updated : బుధవారం, 19 డిశెంబరు 2018 (17:10 IST)

#RRRలో కోలీవుడ్ యాక్టర్ సముద్రఖని..

కోలీవుడ్‌లో నటుడిగానే కాకుండా పలు సినిమాలకు దర్శకత్వ పగ్గాలు చేపట్టిన సముద్రఖనికి బంపర్ ఆఫర్ వచ్చింది. బాహుబలి మేకర్, జక్కన్న దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ట్రిపుల్ ఆర్ సినిమాలో సముద్రఖని నటించనున్నారని తెలిసింది. 
 
ఇప్పటికే కోలీవుడ్‌లో పలు సినిమాలతో యాక్టర్‌గా బిజీగా వున్న సముద్రఖని ట్రిపుల్ ఆర్‌లో కీలక పాత్ర పోషిస్తారని.. సెకండ్ షెడ్యూల్ నుంచి జక్కన్న టీమ్‌తో సముద్రఖని కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. 
 
ఇప్పటికే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పేట్టా సినిమాలో కూడా సముద్రఖని నటించారు. సంక్రాంతి కానుకగా పేట్టా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రాజమౌళి దర్శకత్వం వహించే ట్రిపుల్ ఆర్ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. 2020లో ఈ సినిమా విడుదల కానుంది