1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : శనివారం, 17 సెప్టెంబరు 2016 (13:42 IST)

'శ్రీమంతుడు' బాటలో సోను సూద్.. పంజాబ్‌లో ఓ గ్రామం దత్తత

సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ 'శ్రీమంతుడు'గా నిరూపించుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇప్పటికే సొంత ఊరు బుర్రిపాలెం దత్తత తీసుకున్న మహేష్, మరో గ్రామాన్ని కూడా దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చాడు.

సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ 'శ్రీమంతుడు'గా నిరూపించుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇప్పటికే సొంత ఊరు బుర్రిపాలెం దత్తత తీసుకున్న మహేష్, మరో గ్రామాన్ని కూడా దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చాడు. అంతేకాదు తెలంగాణ మంత్రి కే తారకరామారావు సలహా మేరకు 'గ్రామజ్యోతి' పథకంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలోని మారుమూల వెనకబడిన గ్రామాన్ని మహేష్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.
 
కరువు, వలసల బారిన పడిన మహబూబ్‌నగర్‌ జిల్లాలోని గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. మహేష్ బాబు అడుగుజాడల్లో సినీ ప్రముఖులే కాక వ్యాపారస్తులు, రాజకీయనాయకులు, ఎన్ఆర్ఐ‌లు కూడా గ్రామాలను దత్తత తీసుకుంటూ పల్లెటూర్లలో ఉన్న వారికి ఉత్సాహాన్ని, స్ఫూర్తినినింపి వారి జీవితంలో వెలుగులు నింపుతున్నారు. 
 
ఈ కోవలో విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ కూడా తెలంగాణలోని ఓ ఉరిని దత్తత తీసుకొన్నాడు. ఇప్పుడు బాలీవుడ్ హీరో సోను సూద్ సైతం పంజాబ్ రాష్ట్రంలోని ఓ ఊరిని దత్తత తీసుకొని ఊరిలో రోడ్లు, యువకులకు జిమ్ వంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించాడు. మొత్తానికి మన 'శ్రీమంతుడి' స్ఫూర్తితో ఇలా చాలా మంది శ్రీమంతులుగా మారడం నిజంగా గొప్ప విషయం.