గురువారం, 20 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 మే 2024 (18:17 IST)

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

warangal aunty
వరంగల్ ఆంటీ చేసిన పనికి మగరాయుళ్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇంతకీ ఆ ఆంటీ ఏ తప్పు చేయలేదు. అయినప్పటికీ పురుషులు మాత్రం ఆమెను చూసి ఔరా అంటూ నోరెళ్లబెట్టారు. ఇంతకీ ఆ వరంగల్ ఆంటీ చేసిన పనేంటో ఓ సారి చూద్దాం. సాధారణంగా మహిళలు స్కూటీ లేదా, యాక్టివా లేదా గేర్లు లేని ద్విచక్రవాహనాలను నడుపుతుంటారు. గేర్లతో కూడిన, వారి వస్త్రాధారణకు అనువుగా లేని బైకులను నడపడం చాలా అరుదుగా చూస్తుంటాం. కానీ, వరంగల్‌లో మాత్రం ఓ మహిళ చీరకట్టులో స్పోర్ట్స్‌బైకుపై రివ్వును రోడ్లపై దూసుకెళ్లి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఈ వీడియో ఇపుడు నెట్టింట వైరల్‌గా మారింది. 
 
వరంగల్‌కు చెందిన ఆ యువతికి స్పోర్ట్స్ బైక్ నడపడమంటే అమితమైన ఇష్టం. ఇందుకోసం ఏకంగా జెట్టీ బైకర్ గర్ల్ పేరిట ఇన్‌‍స్టాగ్రామ్‌లో రీల్స్ పోస్ట్ చేస్తుంది. వివిధ రకాలైన దస్తులు ధరించి బైక్ నడిపిన వీడియోలను నెటిజన్లతో పంచుకుంటుంది. అయితే, ఎక్కడా కూడా తన మొహం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇందుకోసం పక్కాగా హెల్మెట్లు ధరించి తీసిన వీడియోలను షేర్ చేస్తుంది. అందులోభాగంగానే తాజాగా చీరకట్టులో స్పోర్ట్స్‌బైకు నడిపిన వీడియోను షేర్ చేసింది. 
 
ఈ వీడియోలో ఆమె ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బైకును ఆపింది. పిస్తా కలర్ చీర, అందుకు మ్యాచింగ్ గాజులు కూడా వేసుకుంది. బైకుపై వెళుతున్న మరో కుటుంబంలో వెనుక కూర్చొన్న మహిళ.. ఆ యువతిని అలా కాసేపు చూస్తుండిపోయింది. ఆ తర్వాత గ్రీన్ సిగ్నల్ పడగానే గేర్ మార్చి రయ్ మంటూ దూసుకెళ్లింది. ఈ నెల 5వ తేదీన ఇన్‌స్టాలో పోస్ట్ అయిన ఈ వీడియోకు ఇప్పటికే 3.16 లక్షల లైక్స్ లభించాయి. 
 
ఈ వీడియోను చూసిన నెటిజన్లంతా ఆమెను శివంగితో పోల్చుతూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బైకుపై బయటకు స్వతంత్రంగా వెళుతున్న యువతి.. ఆమె పక్కనే ఉన్న  బైకుపై భర్తపై ఆధారపడి బయటకు వచ్చిన మహిళ అంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు. నేటి ఆధునిక కాలంలో యువతులంతా ఇలానే ఉండాలని మరికొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.