1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Two farmers killed due to lightning strike in Warangal

వడగళ్ల వాన, పిడుగులు.. వరంగల్‌లో ఇద్దరు రైతుల మృతి

lightning
వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో తీవ్ర వేడిమితో అల్లాడుతున్న ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే వడగళ్ల వాన, పిడుగులు ఊహించని నష్టాన్ని మిగిల్చాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఒకే రోజు పిడుగుపాటుకు ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఆదివారం రాత్రి కురిసిన వడగళ్ల వాన ఊహించని నష్టాన్ని మిగిల్చింది. మిర్చి, వరి, బొప్పాయి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 
 
చేతికి అందిన పంట నీటమునిగిందని రైతులు విలపిస్తున్నారు. పంటలను కాపాడుకునే క్రమంలో వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు ఇద్దరు రైతులు మృతి చెందారు.
 
ములుగు జిల్లా ఏటూరు నాగారంలో పిడుగుపాటుకు బుల్లయ్య అనే రైతు మృతి చెందాడు. ఎండు మిరపకాయలు తడవకుండా పాల్టిన్ కవర్‌తో కప్పుతుండగా మరో రైతు పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. 
 
రఘునాథపల్లి మండలం కోడూరు గ్రామంలో దాసరి అజయ్ (25) అనే రైతు పొలంలో పిడుగుపడి మృతి చెందాడు. రైతుతో పాటు ఆవు, దూడ కూడా పిడుగుపాటుకు గురయ్యాయి. 
 
వాజేడు మండలం బొల్లారంలో పిడుగుపాటుకు గుడిసె ధ్వంసమైంది. ఆ గుడిసెలో నివసిస్తున్న కుటుంబం తీవ్ర గాయాలతో బయటపడింది. వీరిని వెంకటాపురం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
చింతపండు, యూరియా బస్తాలతో గంజాయి తరలింపు