గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 డిశెంబరు 2023 (23:10 IST)

దగ్గుబాటి అభిరామ్ పెళ్లికి శ్రీలీల.. వధువు ప్రత్యూష ఎవరో తెలుసా?

Sreeleela
శ్రీలీల టాలీవుడ్ టాప్ మోస్ట్ హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో పాటు ఆమె నితిన్ సినిమాలో నటిస్తోంది. పనిలో పనిగా తన ఎంబీబీఎస్ చదువును కూడా పూర్తి చేయనుంది. తాజాగా దగ్గుబాటి అభిరామ్ పెళ్లికి శ్రీలీల హాజరు కానుంది. 
 
నిజానికి, దిగ్గజ నిర్మాత సురేష్ బాబు చిన్న కుమారుడు అభిరామ్ దగ్గుబాటి (రానా సోదరుడు), ప్రత్యూష చపరాల వివాహం రేపు (డిసెంబర్ 6) శ్రీలంకలోని ఫైవ్ స్టార్ రిసార్ట్‌లో జరుగనుంది. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం, చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు ఇప్పటికే శ్రీలంక చేరారు. ఈ వివాహం గెస్ట్ లిస్ట్‌లో స్టార్ హీరోయిన్ శ్రీలీల కూడా ఉన్నారు.
 
 పెళ్లికి హాజరయ్యేందుకు ఈ బ్యూటీ తన షెడ్యూల్‌లన్నింటినీ వదులుకుని వెళ్లిందా అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇందుకు కారణం లేకపోలేదు.

అసలు సంగతి ఏంటంటే.. దగ్గుబాటి అభిరామ్ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి.. వధువు, ప్రత్యూష శ్రీలీలకు నటికి చిన్ననాటి స్నేహితురాలు. అలాగే ప్రత్యూష, శ్రీలీలతో అమెరికా కాలేజీలో కలిసి చదివిన స్నేహితులు. అందుకే శ్రీలీల ప్రత్యూష కోసం తన షూటింగ్‌ను పక్కనబెట్టి పెళ్లికి హాజరు కానుందని తెలిసింది.