మంగళవారం, 27 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 నవంబరు 2023 (22:24 IST)

కేఎఫ్‌సీ థీమ్‌లో వెడ్డింగ్.. బొకేలో వాడే పువ్వులకి బదులుగా..?

wedding
wedding
థీమ్ వెడ్డింగ్ అనేది ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. తాజాగా కొత్త థీమ్‌తో తమ వివాహ వేడుకను జరుపుకుంది ఓ జంట. క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ ఇష్టపడే వారైతే మీకు ఎంతో ఇష్టమైన వార్త ఇది. వివరాల్లోకి వెళితే.. ఫేస్ బుక్ యూజర్ లియాంగ్ లే వాంగ్ తన వాల్ మీద తన డ్రీమ్ వెడ్డింగ్ ఫోటోలతో పాటు వీడియోలను షేర్ చేసుకున్నారు. 
 
ఈ వెడ్డింగ్ కేఎఫ్‌సీ థీమ్‌లో వుంది. ఆ ఫోటోల్లో వధూవరులు ఇద్దరు జింగర్ బర్గర్, చికెన్ వింగ్స్ బకెట్‌తో పాటు క్రిస్పీ చికెన్‌లతో ఫోజులు ఇస్తూ కనిపించారు. ఈ ఫోటోల్లో పెళ్లి బొకే అందర్నీ ఆకట్టుకుంది. 
 
సాధారణంగా బొకేలో వాడే పువ్వులకి బదులుగా డీప్ ఫ్రైడ్ చికెన్ లెగ్‌లతో తయారు చేసారు. వధూవరులిద్దరూ కేఎఫ్‌సీ ఫ్యాన్స్ అట. ఈ బ్రాండ్ వీరి వివాహానికి ఖర్చైన ఫుడ్‌లో సగం భరించిందని న్యూయార్క్ పోస్టు వెల్లడించింది.