గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 మార్చి 2022 (19:28 IST)

ఇండస్ట్రీతో సంబంధం లేని అమ్మాయితో సుడిగాలి సుధీర్ ఎంగేజ్‌మెంట్?

బుల్లితెరపై రష్మీ, సుధీర్ జంట చూడముచ్చటగా ఉంటుంది. అయితే రష్మీతో కాకుండా వేరొక అమ్మాయితో అతనికి నిశ్చితార్థం జరిగిపోయింది. అయితే ఇదంతా స్కిట్ కోసమేననే నెటిజన్లు అంటున్నారు. 
 
ఓ కామెడీ షోలో సుధీర్‌కు ఎంగేజ్‌మెంట్‌ జరిపించారు. దీంతో అయోమయానికి లోనైన కొందరు అభిమానులు సుధీర్‌ త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్నాడా? అని షాకయ్యారు. 
 
గతంలో సుధీర్‌కు నిశ్చితార్థమేంటి? ఏకంగా పెళ్లి కూడా చేశారు. కాకపోతే అదంతా స్కిట్‌లో భాగంగానే! దీంతో ఈ ఎంగేజ్‌మెంట్‌ కూడా కచ్చితంగా ప్రాంక్‌ అయ్యుంటుందని అభిప్రాయపడుతున్నారు మెజారిటీ నెటిజన్లు. 
 
అయితే ఇండస్ట్రీకి సంబంధం లేని అమ్మాయి చేతికి సుడిగాలి సుధీర్ ఉంగరం తొడిగాడు. దీంతో ఇది ఫ్రాంక్ అయి వుండదని చాలామంది అంటున్నారు. 
 
ఇకపోతే.. కెరీర్ ప్రారంభించి జబర్ధస్త్ షోలోకి ఆర్టిస్టుగా అడుగు పెట్టాడు. అలా వచ్చిన చాలా తక్కువ సమయంలోనే తనదైన శైలి టైమింగ్‌తో విశేషమైన గుర్తింపు అందుకున్న సంగతి తెలిసిందే.